Just In
- 5 hrs ago
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- 6 hrs ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
- 6 hrs ago
ఎవ్వరూ తగ్గడం లేదు.. కోల్డ్ వార్ ముదిరింది.. కొత్త షోలతో బుల్లితెరపై ఫైట్
- 7 hrs ago
బ్లాక్లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
Don't Miss!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గర్ల్ ఫ్రెండుతో కలిసి అఖిల్ తొలిసారి కెమెరాకు చిక్కాడు... (ఫోటోస్)
హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రేమాయణం కొంత కాలంగా మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఈ మధ్య కాలంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అఖిల్ కూడా తాను ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకోవడమే ఇందుకు కారణం.
అఖిల్ తాను ప్రేమలో పడ్డట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆమె వివరాలు బయటకు లీక్ అయ్యాయి. శ్రేయా భూపాల్ అనే డిజైనర్ తో అఖిల్ ప్రేమలో పడ్డాడని, హైదరాబాద్ లోని ఓ వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిసి పోయింది.
ఒక వేళ ఆ వార్తలు అబద్దం అయితే అఖిల్ మీడియా ముందుకొచ్చి దాన్ని ఖండించేవాడు.... కానీ అలా జరుగలేదు. దీంతో ఆ వార్తలు నిజమే అని తేలి పోయింది. నాగార్జున కూడా ఈ వార్తలు విని సంతోషం వ్యక్తం చేయడంతో అఖిల్ లవ్ ఎఫైర్ వార్తకు మరింత బలం చేకూరింది.
అయితే అఖిల్ ప్రేమాయణం గురించి మీడియాలో వార్తలు రావడమే తప్పితే... ఇప్ప టి వరకు అఖిల్ ఆమెతో కలిసి కనిపించింది లేదు. ఎట్టకేలకు అఖిల్ తన ప్రియురాలితో కలిసి కెమెరాకు చిక్కాడు.
శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో అఖిల్ తన ప్రియురాలితో కలిసి దిగిన ఫోటోస్ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి.

ప్రియురాలితో కలిసి..
ప్రియురాలుశ్రేయా భూపాల్ తో కలిసి అఖిల్ తొలిసారి కెమెరాకు చిక్కాడు.

ఎక్కడి ఫోటో ఇది?
నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి.. ఎంపి టి.సుబ్బిరామి రెడ్డి చెల్లెలు కొడుకుని వివాహం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలోనిదే ఈ ఫోటో. ఈ పార్టీలో ఫ్యాషన్ డిజైన్, మోడల్ శిల్పారెడ్డితో పాటు మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు.

చిరు పార్టీలో కూడా..
ఇటీవల జరిగిన చిరంజీవి 61వ బర్త్ డే పార్టీలో కూడా అఖిల్, శ్రీయా భూపాల్ పాల్గొన్నారు. రామ్ చరణ్ వైఫ్ ఉపాసనకు శ్రీయ భూపాల్ చాలా క్లోజ్. ఆమె కోసం వెయింటింగ్ అంటూ ఉపాసన ఓ పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఇంత చిన్న వయసులోనే..
అఖిల్ అక్కినేని ఇంత చిన్న వయసులోనే ప్రేమలో పడటం అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఎవరి కూతురు?
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ శాలిని భూపాల్ కూతురు అని అంటున్నారు.

న్యూయార్కులో..
ఈ అమ్మాయి అమెరికా న్యూయార్కులోని ‘పార్సన్స్ స్కూల్ ఆప్ డిజైన్' డిజైనింగ్ కోర్సు చేసిందట.

ఫ్యామిలీ ఫ్రెండ్
ఆ అమ్మాయి ఫ్యామిలీ, నాగ్ ఫ్యామిలీ మధ్య ఎప్పట్నుంచో మంచి స్నేహం ఉందట. అయితే అఖిల్, ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్న విషయం మాత్రం కుటుంబ సభ్యులకు తెలియదు. ఇటీవల ఆ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పి వారికి పరిచయం చేసాడట అఖిల్.

కానీ...
నాగ చైతన్య పెళ్లి సెట్టయిన తర్వాతే అఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టాలనుకున్నాడు. కానీ విషయం ఆల్రెడీ లీక్ అయిపోయింది.

నాగ చైతన్య, సమంత
నాగ చైతన్య హీరోయిన్ సమంతతో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తలిసిందే. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

వేర్వేరుగానే..
ఆ మధ్య చైతన్య, అఖిల్ వివాహాలు ఒకేసారి జరుగుతాయనే ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని, ఇద్దరి పెళ్లిళ్లు వేర్వురుగానే జరుగుతాయని నాగార్జున స్పష్టం చేసారు.

మరో పిక్
జూనియర్ జీవికె సిస్టర్ ఎంగేజ్మెంట్ ఈ వెంటులో అఖిల్ (కుడి వైపు చివర్లో), శ్రీయ భూపాల్ (ఎడమ వైపు మొదటి వ్యక్తి)