Agent Twitter Review: అఖిల్ మూవీకి ఊహించని టాక్.. అవే సినిమాకు మైనస్‌.. ఏజెంట్ హిట్టా ఫట్టా అంటే!

అక్కినేని అఖిల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన రీతిలో సత్తా చాటుతోన్నాడు. హీరోగా మంచి ఆరంభాన్ని అయితే అందుకోలేదు కానీ, ఫాలోయింగ్‌ను మాత్రం భారీగా పెంచుకున్నాడు. ఈ జోష్‌తోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు. ఇలా ఎట్టకేలకు ఒక విజయాన్ని అందుకున్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు అఖిల్ 'ఏజెంట్' అనే సినిమాను చేశాడు. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూను చూద్దామా!

ఏజెంట్‌గా ఎంటరైన అఖిల్:సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించిన మూవీనే 'ఏజెంట్'. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను చేశారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించగా.. హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని అందించాడు.

Akhil Akkineni Starrer Agent Movie Twitter Review

అలాంటి స్టోరీ... ట్విస్టులతో:వైల్డ్ సాలాగా పేరొందిన ఓ స్పై.. తనకు అప్పగించిన మిషన్‌ను ఏ విధంగా సాధించాడు? ఈ క్రమంలోనే అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఈ యంగ్ ఆఫీసర్ ఎలా డీల్ చేశాడు? అనే అంశాలతో 'ఏజెంట్' మూవీ తెరకెక్కింది. ఇందులో ఎన్నో ట్విస్టులు కూడా ఉంటాయని చిత్ర యూనిట్ ముందు నుంచీ చెప్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతూనే వచ్చాయి.

ఫస్టాఫ్ బిలో ఏవరేజ్ అని:అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీని చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ఇలా స్పందించాడు. 'ఏజెంట్ ఫస్టాఫ్ బిలో ఏవరేజ్‌గా ఉంది. ఇందులో వార్నింగ్ ఇచ్చే సీన్‌తో పాటు ఇంటర్వెల్ మినహా అంతా రొటీన్‌గా, సాదాసీదాగా సాగిపోయింది. ముఖ్యంగా పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బాలేదు. హీరోయిన్‌కు లిప్ సింక్ అవలేదు. ఆమె సీన్స్ బోరింగ్‌గా ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు.

అన్ని విభాగాల్లోనూ నిరాశ:అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన 'ఏజెంట్' మూవీని వీక్షించిన మరో నెటిజన్ 'ఏజెంట్ మూవీ అనేది దాదాపు అన్ని విభాగాల్లోనూ సరైన విధంగా న్యాయం చేయలేక నిరాశ పరిచిన యాక్షన్ సినిమా. బలహీనమైన స్క్రిప్టు, పేలవమైన దర్శకత్వం, మర్చిపోలేని సంగీతంతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కఠినమైన అనుభవాన్ని మిగుల్చుతుంది' అని రాసుకొచ్చాడు.

సరిగా వాడుకోలేదంటూ:అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' మూవీని చూసిన వేరే నెటిజన్ సురేందర్ రెడ్డిపై దారుణమైన కామెంట్లు చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'అఖిల్ తన బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ కోసం చేసిన కష్టాన్ని సురేందర్ రెడ్డి దుర్వినియోగం చేశాడని చెప్పొచ్చు. ఈ మూవీ పూర్తి అర్థం లేని కథనం, చెత్త స్క్రీన్‌ప్లేతో నిరాశ పరిచేలా ఉంది' అని వెల్లడించాడు.

మొత్తం బలహీనంగానే:అఖిల్ 'ఏజెంట్' మూవీని వీక్షించిన మరో నెటిజన్ 'ఏజెంట్ మూవీ ఓవరాల్‌గా బిలో ఏవరేజ్ లేదా వికృతమైన స్పై యాక్షన్ ఫిల్మ్. కొన్ని సన్నివేశాలు మినహా ఈ చిత్రంలో అన్నీ తప్పుగానే ఉన్నాయి. విలన్ పాత్రతో పాటు రచన చాలా స్టుపిడ్‌గా, బలహీనంగా అనిపించింది. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ దారుణం. సురేందర్ రెడ్డి చాలా తడబడినట్లు అనిపించింది' అని చెప్పాడు.

అఖిల్ క్యారెక్టర్‌ అతిగానే:'ఏజెంట్' మూవీని చూసిన ఇంకో నెటిజన్ 'ఏజెంట్ మూవీలో అఖిల్ ఎనర్జిటిక్ రోల్‌ను బాగానే చేశాడు. కానీ, అతడి క్యారెక్టరైజేషన్ ఒక్కోసారి అతిగా ప్రవర్తించినట్లు అనిపిస్తుంది. అంతేకాదు, ప్రతి స్పై సినిమానూ గుర్తు చేసేలా ఉంది. ఇక, లాజిక్ లేని సీన్లు, పేలవమైన క్లైమాక్స్ ఉన్న ఈ సినిమాను సీరియస్‌గా తీసుకోవడం చాలా కష్టం. నా రేటింగ్ 2.25/5' అని వివరించాడు.

Akhil Akkineni Starrer Agent Movie Twitter Review

ఫైనల్‌గా టాక్ ఎలా ఉంది:'ఏజెంట్' మూవీకి సంబంధించిన షోలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లు ప్రకారం.. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందులోనూ చాలా మంది ఇది బాలేదని అంటున్నారు. కథ రొటీన్‌గా ఉందని, పాటలు సరైన సమయంలో పెట్టలేదని, సినిమా అంతా ఫ్లాట్‌గా సాగిపోయిందని, స్క్రీన్‌ప్లే బాలేదని చెప్తూ ట్విట్టర్‌లో కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X