ఎంట్రీ: సంబరంలో అఖిల్ అక్కినేని, ఏమన్నాడంటే..
హైదరాబాద్: అక్కినేని కుటుంబం నుంచి మరో వారసుడు తెరంగ్రేటం చేయబోతున్నాడు. నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని ఈ సంవత్సరం వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు. నాగార్జున స్వయంగా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈచిత్రాన్ని తానే నిర్మించబోతున్నట్లు తెలిపారు.
సినిమా హీరో కావాలన్న తన ఈ సంవత్సరం నెరవేరుతుండటంపై ఎంతో సంతోషంగా ఉన్న అఖిల్ కూడా తన ట్విట్టర్ ద్వారా తన మనసులోని మాటను బయట పెట్టాడు. 'మీ అందరి ప్రోత్సాహంతో వెండితెరకు పరిచయం కాబోతున్నాను. ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సంవత్సరం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. అయితే ఇంకా డేట్స్ ఖరారు కాలేదు. ప్రాజెక్టు ఫైనల్ అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాను.' అని అఖిల్ తెలిపారు.

కాగా...అఖిల్ ఎంట్రీ విషయం ఖరారు కాగానే ఫిల్మ్ నగర్లో రూమర్లు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల విడుదలై హిట్టయిన 'ఉయ్యాల...జంపాల' హీరోయిన్ అవిక అఖిల్ తెర్రంగ్రేటం చేసే సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో త్వరలో తేలనుంది.
కథ, ఎంపిక చాయిస్ అఖిల్‌కే..
'నాగ చైతన్య తొలి సినిమాను వేరే నిర్మాత చేతిలో పెట్టి తప్పు చేసాను. నేను నిర్మించే అవకాశం ఉండి చేయలేదు. కానీ అఖిల్ విషయంలో మాత్రం ఆ తప్పు చేయను. నేనే వాడి తొలి సినిమా నిర్మిస్తాను. కథ, దర్శకుడిని ఎంపిక చేసుకునే అవకాశం మాత్రం వాడికే ఇస్తాను' అని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











