Most Eligible Bachelor Twitter Review: మూవీకి ఊహించని టాక్.. ప్లస్ మైనస్ ఇవే.. ఆ పొరపాటు లేకుంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్ల కుటుంబాల నుంచి వారసులు హీరోలుగా పరిచయం అవుతున్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే అద్భుతమైన టాలెంట్లను చూపించుకుంటూ స్టార్లుగా ఎదిగిపోయారు. మిగిలిన వాళ్లంతా పలు కారణాలతో విజయాన్ని అందుకోలేదు. కానీ, హ్యాండ్సమ్ లుక్స్, యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా సక్సెస్ కాలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్.

ఇప్పటికే పలు సినిమాలు చేసిన అతడు.. హిట్‌ను సొంతం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాకు ట్విట్టర్‌లో వస్తున్న రివ్యూలపై ఓ లుక్కేద్దాం పదండి!

‘బ్యాచ్‌లర్'గా వచ్చిన అక్కినేని అఖిల్

‘బ్యాచ్‌లర్'గా వచ్చిన అక్కినేని అఖిల్

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో నేడు వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

అంచనాలు భారీగా.. మరింత పెంచేస్తూ

అంచనాలు భారీగా.. మరింత పెంచేస్తూ

ఫీల్ గుడ్ రొమాంటిక్ జోనర్‌లో అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులోని 'లెహరాయీ' సాంగ్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, టీజర్, ట్రైలర్‌ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 18.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

అఖిల్ మూవీకి ఊహించని విధంగా టాక్

అఖిల్ మూవీకి ఊహించని విధంగా టాక్

ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశల నడుమ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడిపోయాయి. అలాగే, పలు ప్రాంతాల్లోనూ కొన్ని షోలు వేశారు. అన్ని చోట్లా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అయితే, సినిమాను చూసిన వాళ్లలో కొందరు బాగుందని, కొందరు బాలేదని అంటున్నారు.

మూవీలో ప్లస్ మైనస్ పాయింట్ ఇవేనట

మూవీలో ప్లస్ మైనస్ పాయింట్ ఇవేనట


'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీని చూసిన వాళ్లంతో ట్విట్టర్ వేదికగా తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అఖిల్, పూజా నటన.. గోపీ సుందర్ అందించిన సంగీతం.. స్క్రీన్‌ప్లే.. డైలాగులు.. కామెడీ ట్రాక్ ప్లస్ అయ్యాయట. అయితే, సెకెండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ మైనస్‌గా మారాయన్న టాక్ వినిపిస్తోంది.

 ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా.. మొత్తంగా

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా.. మొత్తంగా

వీక్షకుల అభిప్రాయం ప్రకారం.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఫన్‌ అండ్ రొమాంటిక్‌గా సాగుతుందట. ఇందులో వచ్చే కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోని విధంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ పొరపాటు జరగకుండా ఉండాల్సింది

ఆ పొరపాటు జరగకుండా ఉండాల్సింది

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీని చూసిన వారిలో ఎక్కువ మంది దర్శకుడి గురించి ట్వీట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్‌ను బొమ్మరిల్లు మూవీలా.. సెకెండాఫ్‌ను ఆరెంజ్ సినిమాలా నడిపించాడని అంటున్నారు. మొదటి భాగంలో చూపించిన శ్రద్ధ.. ద్వితియార్ధంపై చూపలేనట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. ల్యాగ్ లేకుండా ఉండుంటే సినిమా సూపర్ హిట్ అయ్యేదని చెబుతున్నారు.

Recommended Video

Pooja Hegde, Akhil Akkineni Interview | Most Eligible Bachelor
మొత్తంగా అఖిల్ సినిమా ఎలా ఉందంటే

మొత్తంగా అఖిల్ సినిమా ఎలా ఉందంటే


ఇప్పటి వరకూ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'ను చూసిన వాళ్లు చెబుతున్న దాని ప్రకారం.. ఈ సినిమా ఏవరేజ్‌గా ఉంటుందట. కుటుంబ కథా నేపథ్యమే అయినా రొమాంటిక్ యాంగిల్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చకపోవచ్చు అన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇది కాలక్షేపం అయ్యే ఓ రొమాంటిక్ డ్రామా అని అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం పండుగ సెలవుల్లో మీరూ దీన్ని చూసేయండి మరి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X