twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది మామూలు క్రేజ్ కాదు.. డిగ్రీ పుస్తకాల్లో అఖిల్ మోనాల్!

    |

    బిగ్ బాస్ షో నాల్గో సీజన్ నడిచినన్ని రోజులు సోషల్ మీడియాలో సందడి వాతావరణం నెలకొంది. కంటెస్టెంట్లపై ట్రోల్స్, నెటిజన్లు కామెంట్లు, అభిమానుల ప్రేమ, ఒకరిపై ఒకరు సోషల్ వార్ ప్రకటించడం ఇలా రచ్చ రచ్చ జరిగేది. నాల్గో సీజన్ నడిచినంత కాలం మోనాల్ అఖిల్ పేర్లు మాత్రం ట్రెండ్ అవుతూనే వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనేలా బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేయడం, దానికి తగ్టట్టే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. బయటకు వచ్చాక కూడా అదే రేంజ్‌లో హల్చల్ చేస్తోంది ఈ జంట.

     బిగ్ బాస్ ఇంట్లో అలా..

    బిగ్ బాస్ ఇంట్లో అలా..

    బిగ్ బాస్ ఇంట్లో మోనాల్ నడిపిన ట్రాకుల గురించి అందరికీ తెలిసిందే. అభిజిత్ అఖిల్ అంటూ మోనాల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ చివరకు మోనాల్ అఖిల్‌తోనే సెటిలైంది. బయటకు వచ్చేటప్పుడు, బయటకు వచ్చాక మోనాల్ అఖిల్ మరింత దగ్గరయ్యారు.

    అఖిల్ కోసం..

    అఖిల్ కోసం..

    మోనాల్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక తన పూర్తి మద్దతును అఖిల్‌కే ఇచ్చింది. అఖిల్ గెలుస్తాడంటూ ఎంతో ధీమా వ్యక్తం చేసింది. అదే సమయంలో అభిజిత్ మీద నెగెటివ్ పెరిగేలా కామెంట్లు చేసింది. కానీ చివరకు అఖిల్ రన్నర్‌గా మిగిలాడు.. అభిజిత్ గెలిచాడు.

    ఆ ఇద్దరూ కలిసి..

    ఆ ఇద్దరూ కలిసి..

    బిగ్ బాస్ అనంతరం మోనాల్ హైద్రాబాద్‌లోనే సెటిలైంది. మోనాల్ అఖిల్ కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. షోలు, ఈవెంట్లు, ప్రైవేట్ పార్టీలు అంటూ అఖల్ మోనాల్ దుమ్ములేపుతున్నారు. ఇక ఈ ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా చేసేస్తున్నారు. గుజరాత్ అమ్మాయి.. తెలుగబ్బాయి అంటూ రాబోతోన్న వెబ్ సిరీస్‌పై మంచి హైప్ ఏర్పడింది.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    తాజాగా ఈ ఇద్దరి క్రేజ్‌కు నిదర్శనంగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేవి డిగ్రీలో ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అందులో ప్రత్యక్ష పరోక్ష వాక్యాల్లో మోనాల్ అఖిల్ పేర్లను వాడేశారు.

     ఆశ్చర్యంలో అఖిల్..

    ఆశ్చర్యంలో అఖిల్..

    అలా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్‌లో మోనాల్ అఖిల్ పేర్లు ఉన్నాయని, డిగ్రీ పుస్తకాల్లో ఇలా కనిపించాయని ఓ నెటిజన్ షేర్ చేశాడు. వాటిని చూసిన అఖిల్ ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ జంట క్రేజ్ చూసి అందరూ ముచ్చటపడుతున్నారు.

    English summary
    AKhil And Monal Name In Degree Textbook,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X