Samantha Myositis: సమంత వ్యాధిపై సెలబ్రిటీల రియాక్షన్.. అఖిల్ ఏమన్నాడంటే..

నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయింది. తరచుగా మోటివేషనల్ కొటేషన్లు, పెట్ ఫొటోలు, పర్సనల్ విషయాలను సామాజికి మాధ్యమం ద్వారా వెల్లడించే సామ్ నుంచి ఏ ఒక్క అప్డేట్ రాలేదు. దీంతో సమంతకు ఏమైందో అని అభిమానులు టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలోనే అనేక రూమర్లు వచ్చిపడ్డాయి. అయితే వాటికి సమంత టీమ్ క్లారిటీ అప్పుడే ఇచ్చేసింది. అయితే తాజాగా సమంతం తను బాధపడుతున్న అటోఇమ్యునల్ వ్యాధి మయోసిటిస్ గురించి చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. పలువురు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు, డైరెక్టర్ రాఘవేంద్ర రావుతోపాటు అక్కినేని అఖిల్ పోస్ట్ పెట్టారు.

 విలక్షణమైన నటనతో..

విలక్షణమైన నటనతో..

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే ఎనలేని స్టార్​ డమ్ సంపాదించుకుంది ఈ బ్యూటి. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో విలక్షణమైన నటనతో అలరించిన సామ్ ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం, యశోద చిత్రాలు ఉన్నాయి.

 త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు..

త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు..

ఇటీవల విడదలైన యశోద ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన సమంత సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపుతూ తనకు వచ్చిన అటోఇమ్యునల్ వ్యాధి మయోసిటిస్ గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. సమంతకు మయోసిటిస్ ఉన్నట్లు తెలియడంతో అభిమానులు, సెలబ్రిటీలు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

పోస్ట్ పెట్టి సామ్ కు సపోర్టింగ్ గా..

పోస్ట్ పెట్టి సామ్ కు సపోర్టింగ్ గా..

ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు చిరంజీవి, దుల్కర్ సల్మాన్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హీరో రామ్ శ్రియ, లావణ్య త్రిపాఠి, హన్సిక, కాజల్ అగర్వాల్, జాన్వీ కపూర్ ఇప్పటికే సమంత త్వరగా రికవరీ కావాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ధైర్యం చెబుతున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు, డైరెక్టర్ రాఘవేంద్ర రావుతోపాటు అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ పోస్ట్ పెట్టి సామ్ కు సపోర్టింగ్ గా నిలిచాడు.

అమితమైన శక్తిని పంపిస్తున్నా..

''సమంత నువ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. నువ్ మరింత దృఢంగా, ఆరోగ్యంగా తిరిగి రావాలను అమితమైన శక్తిని పంపిస్తున్నా'' అని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ట్విటర్ వేదికగా సమంత పోస్ట్ కు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు సమంత రీట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది.

మునుపటికంటే మరింత స్ట్రాంగ్ గా..

మునుపటికంటే మరింత స్ట్రాంగ్ గా..

సమంత వ్యాధిపై నాగబాబు స్పందిస్తూ తాను ఇప్పటివరకు చూసిన దృఢమైన వ్యక్తుల్లో సమంత ఒకరు అని చెబుతూ ''సమంతతో నేను ఎప్పుడు నేరుగా మాట్లాడకపోయినప్పటికీ.. ఆమె మయోసిటిస్ తో బాధపడుతోందన్న వార్త విని నా హృదయం ద్రవించిపోయింది. నన్ను విచారంలోకి నెట్టింది. ఆమె త్వరగా కోలుకోవాలని, మునుపటికంటే మరింత స్ట్రాంగ్ గా తిరిగి రావాలని కోరుకుంటున్నాను.

మరిన్ని గొప్ప పాత్రల్లో ప్రేక్షకులు చూడాలని..

ఆమెను నేను ఎప్పుడూ ఒక ఇండిపెండెంట్ మహిళగా, చాలా శక్తి సామర్థ్యాలు, ఆశావాద భావాలు కలిగిన మనిషిగా చూశాను. మయోసిటిస్ నుంచి ఆమె పూర్తిగా కోలుకోవాలని మరొక్కసారి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుత తరంలోని గొప్ప నటీమణుల్లో ఆమె ఒకరు. ఆమెను మరిన్ని గొప్ప పాత్రల్లో ప్రేక్షకులు చూడాలని అనుకుంటున్నారు. సమంత అభిమానుల ప్రేమ, అభిమానం ఆమెను ఈ సమస్య నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయని నేను కచ్చితంగా నమ్ముతున్నాను'' అని నాగబాబు ట్వీట్ చేశారు.

 స్పందించిన అక్కినేని అఖిల్..

స్పందించిన అక్కినేని అఖిల్..

ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత వ్యాధిపై ఎవరైనా స్పందిస్తారా అని చాలా మంది అనుకున్నారు. నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ రియాక్ట్ అవుతారా అని అభిమానులు చూశారు. కానీ వాళ్లకు బదులుగా అక్కినేని అఖిల్ రియాక్ట్ అవుతూ పోస్ట్ పెట్టాడు. ''అందరి ప్రేమాభిమానాలే నీకు బలాన్నిస్తాయి'' అని పేర్కొన్నాడు అఖిల్. ఇలా పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూనే ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X