»   »  ఆ స్వేచ్ఛ నాకు లేదు, ఆ వార్తలు పచ్చి అబద్దం: అఖిల్

ఆ స్వేచ్ఛ నాకు లేదు, ఆ వార్తలు పచ్చి అబద్దం: అఖిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున వారసుడు అఖిల్ అక్కినేని తెరంగ్రేటం సమయంలో ఎన్ని అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. పైగా అఖిల్ తొలి చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించడంతో 'అఖిల్' సినిమాకు హైప్ హైరేంజిలో వచ్చింది. ఆ హైప్ చూసి అంతా అఖిల్ సూపర్ స్టార్ కావడం ఖాయం అనుకున్నారు.

కానీ సినిమా రిలీజైన మొదటి ఆటకే అంతా బుస్..అని తేలిపోయింది. సినిమా పరమ ప్లాప్ అయింది. అఖిల్ తెరంగ్రేటం భారీ ఫెయిల్యూర్ తో మొదలైంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. ఈ అఖిల్ కెరీర్‌కు ఆదిలోనే తగిలిన అతిపెద్ద దెబ్బ. ఆ దెబ్బకు అఖిల్ ఇప్పటికీ కోలుకోలేదు. మరో సినిమా మొదలు పెట్టలేదు. అసలు పెట్టడానికి ఎవరూ ధైర్యం చేయలేదు.

తొలి సినిమా ఎంపిక విషయంలో అఖిల్ ఎంత ఆలోచించాడో..... ఇపుడు రెండో సినిమా విషయంలో అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సిన పరిస్థితి. ఎట్టకేలకు అఖిల్ రెండో సినిమా ఓకే అయ్యే దశకు చేరుకుంది. అయితే ఇంకా విషయం ఫైనల్ కాక పోవడం అఖిల్.... అసలు విషయం చెప్పకుండా దాగుడు మూతలు ఆడుతున్నాడు.

Akhil comment about his next film

ఇటీవల ఓ మీడియా సంస్థతో అఖిల్ మాట్లాడుతూ సెకండ్ మూవీ త్వరలో స్టార్ట్ అవుతుందని తెలిపాడు. 'నాకు ఇది లాంగ్ బ్రేక్. అఖిల్ తర్వాత చాలానే ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఏదైనా కొత్తగా ఆసక్తి కలిగేలా ఉండాలని భావించాను. ఇప్పుడు రెండో సినిమా ప్రారంభానికి సిద్ధమవుతున్నాను. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. ఇదో అర్బన్ లవ్ స్టోరీ, సమ్మర్ తర్వాత స్టార్ట్ చేసే అవకాశాలున్నాయన్నారు.

డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? నిర్మాత ఎవరు? అనే విషయాలు చెప్పడానికి అఖిల్ నిరాకరించారు. ఇంతకంటే వివరాలు చెప్పడానికి నాకు స్వేచ్ఛ లేదు...అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసాడు. అఖిల్ బాబు ఇలా తన రెండె సినిమా గురించి.... జ్యోతి లక్ష్మి చూపించీ చూపించనట్లు, చెప్పి చెప్పనట్లు మాట్లాడి అసలు విషయం దాచడంతో అభిమానులు అసంతృప్తికి గురవుతున్నారు.

ఆ వార్తలు పచ్చి అబద్దం...
అఖిల్ అక్కినేని తర్వాతి సినిమా మైత్రి మూవీస్ నిర్మిస్తోందని... అఖిల్ ఈ సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని డిమాండ్ చేసాడని, వారు రూ. 25 కోట్లు పెడతామని అన్నారని ఇద్దరి మధ్య కుదరక డీల్ కాన్సిల్ అయిందని వార్తలొచ్చాయి. ఈ విషయమై అకిల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.... మైత్రి బేనర్ వారు నా రెండో సినిమా గురించి ఎలాంటి సంప్రదింపులు జరుపలేదు. ఇలాంటి వార్తలు ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు. ఏదైనా రాసే ముందు అది నిజమా? కాదా? అనేది కన్‌ఫర్మ్ చేసుకోవాలి. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే ఎలా? అంటూ అఖిల్ అసహనం వ్యక్తం చేసారు.

English summary
Akhil tweeted: "I don't know where you websites get your info from. My second film was never supposed to be produced under Mytri banner. False info. It would be nice if you confirmed before spreading false info to people. This goes unsaid but I guess it has to be spelled out for you guys"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu