పుకార్లు షురూ: క్లారిటీ ఇచ్చిన అఖిల్
హైదరాబాద్: నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని వివి వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. గుర్తింపు ఉన్న స్టార్ హీరోల సినిమాలు మొదలవ్వగానే ఏదో ఒక పుకారు ప్రచారంలోకి రావడం మామూలే. అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన అఖిల్ మొదటి సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.
అఖిల్ చేస్తున్న ఈ చిత్రకథ ఒక సోషియో - ఫ్యాంటసీ అనీ, గతంలో చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి'కీ దీనికీ పోలికలున్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు అఖిల్.

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జోరుగా సాగుతోంది. అన్నపూర్ణా ఏడెకరాల్లో కుటుంబ సన్నివేశాలతో సహా కొన్ని కీలక ఘట్టాలను తీస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన యువ నటి సాయేషా సైగల్ వెండితెరకు పరిచయమవుతున్నారు. వెలిగొండ శ్రీనివాస్ అందించిన ఈ చిత్ర కథకు కోన వెంకట్ - గోపీమోహన్ జంట మాటలు సమకూరుస్తున్నారు.
ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకపై నిఖిత రెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు.


Click it and Unblock the Notifications











