వినాయిక్ ఇంట్లో...అక్కినేని అఖిల్(ఫొటో)
రాజమండ్రి: ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ను పరామర్శించేందుకు అక్కినేని అఖిల్ రాజమండ్రి వచ్చారు. సోమవారం ఉదయం నగరానికి వచ్చిన అఖిల్ ఓ హోటల్‌లో విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి దర్శకుడు వినాయక్ స్వగ్రామం చాగల్లు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ పయనమయ్యారు. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న అఖిల్ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. వినాయక్ తల్లి నాగ రత్నం ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.
వివరాల్లోకి వెళితే... ప్రముఖ సినీ దర్శకుడు వి.వి.వినాయక్ తల్లి నాగరత్నం మృతి చెందడం బాధాకరమైన విషయమని ప్రముఖ సినీనటుడు నాగార్జున తనయుడు అఖిల్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు విచ్చేసిన ఆయన వినాయక్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను అఖిల్ పరామర్శించారు.

జన్మనిచ్చిన తల్లిదండ్రులు గండ్రోతు కృష్ణారావు, నాగరత్నంలను వినాయక్ సోదరులు కోల్పోవడం తీరని లోటని అఖిల్ పేర్కొన్నారు. ఇంకా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఉషా పిక్చర్స్ అధినేత వి.వి.బాలకృష్ణ ఆయన్ను పరామర్శించారు.
మాజీ ఎంపీ సీహెచ్.హరిరామజోగయ్య, వైకాపా కేంద్ర పాలక మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్, తోట గోపి, పారిశ్రామికవేత్త వెజ్జు వెంకటేశ్వరరావు, ఉప్పాల శ్రీనివాస్, మధ్యాహ్న బలరాం, కాపు సంఘ నాయకులు బి.లక్ష్మీనారాయణ, ముత్యాల శ్రీను, పి.జితేంద్ర, చాగల్లు, నెలటూరు సర్పంచులు జొన్నకూటి వెంకాయమ్మ, వూబా దుర్గ, లయన్స్ అధ్యక్షులు కోడూరి రామకృష్ణ, కె.కాశీ, వినాయక్ అభిమానులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











