టైటిల్, ఫస్ట్ లుక్ ఇవిగో :అఖిల్,వినాయిక్ చిత్రం (ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : అఖిల్ తొలి చిత్రం కోసం అక్కినేని అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈ రోజు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని వదిలారు... మీరు ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ లుక్ లో చిత్రం టైటిల్ అఖిల్ అని నిర్ణయించటం కూడా గమనించవచ్చు.

మరో లుక్ ఇక్కడ

ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ నెల 29 ఉదయం 10.30 కు టీజర్ ని విడుదల చేస్తామని అన్నారు. అంటే అఖిల్ తండ్రి నాగార్జున పుట్టిన రోజు కానుకగా టీజర్ ని వదులుతారన్నమాట.

ఈ మేరకు టీమ్ రాత్రింబవళ్లూ పనిచేస్తోంది. అదే రోజున ఈ చిత్రానికి పెట్టే టైటిల్ కూడా రివిల్ కానుంది. ఈ చిత్రం ద్వారా అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది.

ప్రస్తుతం ఈ చిత్ర టీం సౌత్ ఆఫ్రికాలో సాంగ్స్ మరియు కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఉంటుంది. మరో యువ హీరో నితిన్ తండ్రిసుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ - ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక అక్కినేని అఖిల్ తాజా చిత్రం విశేషాలు ..ట్విట్టర్ సాక్షిగా...ఎప్పటికప్పుడు అభిమానులకు చేరుతూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలైంది మొదలు ఎక్కడెక్కడ ఏమేమి చిత్రీకరిస్తున్నారో అఖిల్ సోషల్ మీడియా ద్వారా వివరిస్తూనే ఉన్నాడు.

Akhil debut film first look released

ఓల్డ్ సిటీలో షూటింగ్ ముచ్చట్లు, ఆ మధ్య స్పెయిన్ లో జరిగిన షూటింగ్ వివరాలు కూడా అభిమానులకు తెలిపాడు. అయితే ఇటీవల థాయ్ లాండ్ కు ప్రయాణం అయిన అఖిల్ త్వరలోనే వీడియో ఒకటి విడుదల చేస్తానంటూ ఫ్యాన్స్ కు మాట ఇచ్చాడు. అఖిల్ ఇచ్చిన మాటను చిత్ర నిర్మాత నితిన్ నిలబెట్టుకుంటూ శనివారం మేకింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా అధికారికంగా చిత్ర నిర్మాత నితిన్ విడుదల చేసిన వీడియోతో ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థమైంది! స్పెయిన్ వీధుల్లో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్ లో అఖిల్... ఎంతో రిస్క్ తీసుకుని నటించాడు. అంతేకాదు... ఇటు యూనిట్ సభ్యులతో పాటు... అటు దర్శకుడు వీవీ వినాయక్ తోనూ సూపర్ అనిపించుకున్నాడు.

ఇటు డాన్స్, అటు ఫైట్స్ విషయంలో అఖిల్ అదరగొడుతున్నాడు సరే... ఇంతకూ సినిమా పేరేమిటి? ఎప్పుడొస్తుందన్నది చెప్పమంటున్నారు అఖిల్ అభిమానులు.

యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X