అక్కినేని అఖిల్ తొలి సినిమాకు డేట్ ఫిక్సయింది!
హైదరాబాద్: అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ తెరంగ్రేటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 14న సినిమాను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తారట. అఖిల్ తొలి సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. 2015 మే 1 నాటికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున, నితిన్ సిస్టర్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఢమరుకం ఫేం వెలిగొండ శ్రీనివాస్ కథను అందించగా కోన వెంకట్, గోపీ మోహన్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాసారని అంటున్నారు. అసలు...వాస్తవానికి ఇంకా అఖిల్ సినిమా అఫీషియల్‌గా ఖరారు కానేలేదు. ఇదంతా ఫిల్మ్ నగర్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. అఖిల్ లేదా నాగార్జున స్వయంగా ప్రకటించాల్సి ఉంది.

అఖిల్ సినిమాను తానే నిర్మిస్తానని నాగార్జున గతంలోనే వెల్లడించారు. తన పెద్ద కొడుకు నాగ చైతన్య తొలి సినిమా ‘జోష్' ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడం నాగ చైతన్య కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. మళ్లీ ఆ పొరపాటు జరుగకుండా, అఖిల్ తొలి సినిమానే హిట్టయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాగార్జున.


Click it and Unblock the Notifications











