5 భారీ సెట్స్‌లో ‘అఖిల్’ ఇంట్రడక్షన్ సాంగ్
హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం వివి వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి సమర్పణలో యూత్ స్టార్ నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘అఖిల్'. ఈ చిత్రంలోని ఓ పాటను ఆస్ట్రియాలో, మరో పాటను స్పెయిన్‌లో చిత్రీకరించారు.
ప్రస్తుతం ఈ చిత్రంలోని అఖిల్ ఇంట్రడక్షన్ సాంగ్‌ని అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో ఈ రోజు నుండి చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రియా, స్పెయిన్ లలోని అందమైన లొకేషన్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను చిత్రీకరించడం జరిగింది. ఈ రోజు నుండి అఖిల్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో వేసిన ఐదు భారీ సెట్స్ లో జానీ మాస్టర్ నేతృత్వంలో ఈ ఇంట్రడక్షన్ సాంగ్ ని చాలా గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నాం. ఈ చిత్రం ఆడియోను అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం' అన్నారు.

అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.


Click it and Unblock the Notifications











