అఖిల్ అమ్మా నాన్నా వీళ్ళే: హలో చెప్పండి అంటూ పరిచయం చేశాడు

సీనియర్ తారలు జగపతిబాబు, రమ్యకృష్ణ లను తమ అమ్మా నాన్నలుగా పరిచయం చేస్తూ.. వాళ్ళతో కలసి సినిమా సెట్లో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన అఖిల్.. 'ఈ ఇద్దరికీ పెద్ద హలో చెప్పండి..

Recommended Video

అఖిల్ అమ్మా నాన్నా వీళ్ళేనట ! 'హలో' చెప్పమంటున్నాడు

అఖిల్ డెబ్యూ సినిమానే దారుణంగా దెబ్బ కొట్టింది. మంచి లవ్స్టోరీతో వస్తాడనుకున్న అఖిల్ ప్రపంచాన్నే కాపాడే వీరుడు గా తెరమీదకి వచ్చి పెద్ద డిజాస్టర్‌తో నిరాశ చెందాడు. అందుకే రెండో సినిమాతో ఎలాగైనా హీరోగా సత్తా చాటాలని అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం 'హలో'. అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి మెమెరబుల్ మూవీని ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున

ఈ సినిమాని ఎలా యినా మంచి హిట్ చేయాలన్న తపన అక్కినేని నాగార్జునలో కూడా కనిపిస్తోంది. అందుకే కాస్త సీరియస్‌గా ఈ సినిమా మీద దృష్టిపెట్టాడు. రామ్‌గోపాల్ వర్మ తో చేస్తున్న సినిమాని చూసుకుంటూనే. అఖిల్ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.

అందరికీ హలో

అందరికీ హలో

కాగా రెండు రోజుల క్రితం 'అందరికీ హలో.. సినిమాలోని క్యారెక్టర్‎లను పరిచయం చేసే టైమ్ వచ్చేసింది. అందులో.. ముందు వరుసలో నేనే ఉన్నా. అవినాష్‎కి హలో చెప్పండి' అంటూ తన క్యారెక్టర్‎ని పరిచయం చేసిన అక్కినేని అఖిల్.. తాజాగా ఆయన అమ్మ నాన్నలను కూడా పరిచయం చేశాడు.

జగపతిబాబు, రమ్యకృష్ణ

జగపతిబాబు, రమ్యకృష్ణ

సీనియర్ తారలు జగపతిబాబు, రమ్యకృష్ణ లను తమ అమ్మా నాన్నలుగా పరిచయం చేస్తూ.. వాళ్ళతో కలసి సినిమా సెట్లో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన అఖిల్.. 'ఈ ఇద్దరికీ పెద్ద హలో చెప్పండి.. వారితో కలసి పనిచేయడం ఎంతో ఆనందకరం. జగపతిబాబు సర్ తన చల్లని హృదయంతో.. రమ్యకృష్ణ మామ్ నాచురల్ అండ్ ఎవర్ గ్రీన్ అందచందాలతో సినిమాకు కొత్త అందం తెచ్చారు' అని టాగ్ చేశాడు.

 డిసెంబర్ 22 న

డిసెంబర్ 22 న

ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ ముగ్గురి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. డిసెంబర్ 22 న వస్తున్న ఈ సినిమా ఇప్పుడిప్పుడే మంచి ఆసక్తి రాబట్టుకుంటోంది. ఈ సినిమా హిట్ అయ్యిందంటే అఖిల్ కెరీర్కూడా ఒక గాడిలో పడుతుంది. అప్పుడు నాగార్జున కాస్త ఊపిరి తీసుకుంటాడేమో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X