షార్ట్స్ ఫిల్మ్స్‌లో నటిస్తున్న అక్కినేని అఖిల్
అయితే అఖిల్‌ను డైరెక్ట్‌గా మెయిన్ సినిమాల్లోకి తేకుండా తొలుత షార్ట్ ఫిలింస్ లో నటింప చేసి అతని యాక్టింగ్ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకునేలా ప్లాన్ చేసారు. ఈ మేరకు ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటింపచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల నాగార్జున మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
త్వరలో అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోల సినిమాకు రంగం సిద్ధమవుతోంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య... ముగ్గురు ఒకే సినిమాలో కనిపించబోతున్న సినిమాకు సన్నాహాలు మొదలవుతున్నాయి. ఇటీవల ఇష్క్ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు విక్రమ్ కుమార్ అక్కినేని ఫ్యామిలీ కోసం మంచి సబ్జెక్టు తయారు చేశారు. వీలైతే ఇందులో అఖిల్ కూడా నటించే అవకాశం ఉంది.
ఆ స్టోరీకి నాగార్జున కూడా ఓకే చెప్పాడని వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ నచ్చడంతో తన సొంత బ్యానర్లోనే నిర్మించాలని నాగార్జున డిసైడైనట్లు మొదట్లో వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమాను భారీగా నిర్మించాలని డిసైడయ్యారట. అందుకోసం ప్రముఖ హాలీవుడ్ సినీనిర్మాణ సంస్థ వాల్ డిస్నీ నిర్మించబోతోందని వినిపిస్తోంది. 2013లో ఈ చిత్రం ఫ్లోర్ మీదనకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












