twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మనం చరణ్ తోనే ఆపేశాం.. వాడికి తమ్ముడు ఉండుంటే; అఖిల్ రెండో కొడుకే!': సురేఖతో చిరు

    |

    Recommended Video

    రాంచరణ్-అఖిల్ అలా పిలుచుకుంటారు !

    హలో సినిమా ప్రి-రిలీజ్ వేడుకలో చిరంజీవి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన స్పీచ్ వేడుకకే హైలైట్ అవగా.. మరీ ముఖ్యంగా అఖిల్ తో అనుబంధం గురించి ఆయన చెప్పిన భావోద్వేగ విషయాలు కట్టిపడేశాయి. తన భార్య సురేఖ, తాను అఖిల్‌ను తమ రెండో కొడుకులా భావిస్తామని చెప్పడం విశేషం. అఖిల్ గురించి ఆయన చెప్పిన మరిన్ని విశేషాలు మీకోసం..

    నాగార్జున నాకు పెద్ద పరీక్షే పెట్టాడు?.. ఆ ప్రశ్నలు వెంటాడుతాయి, కానీ!: 'హలో'పై చిరంజీవి..నాగార్జున నాకు పెద్ద పరీక్షే పెట్టాడు?.. ఆ ప్రశ్నలు వెంటాడుతాయి, కానీ!: 'హలో'పై చిరంజీవి..

     ఆ లోటును మరిచిపోతాను:

    ఆ లోటును మరిచిపోతాను:

    అఖిల్ ను చూసినప్పుడల్లా తనకు రెండో కొడుకు లేడనే బాధను మరిచిపోతానని చిరంజీవి పేర్కొనడం గమనార్హం. అఖిల్ ఎప్పుడూ తమ ఇంటికి వచ్చినా.. నన్నూ, సురేఖను ఆప్యాయంగా పలకరిస్తుంటాడని, చరణ్‌ను అన్నయ్యా అని పిలుస్తాడని చిరంజీవి తెలిపారు.

    మనం చరణ్ తోనే ఆపేశాం:

    మనం చరణ్ తోనే ఆపేశాం:

    అఖిల్ ఆప్యాయత చూసి సురేఖ చాలాసార్లు భావోద్వేగానికి లోనయ్యేది అన్నారు. 'మనం చరణ్ తోనే ఆపేశాం. వాడికి మరో తమ్ముడు ఉండుంటే, వాడు అఖిల్ లా ఉండేవాడేమో అనేది. అమల-నాగార్జున ఒప్పుకుంటే అఖిల్ ను పెంచుకుందామని నేను చెప్పేవాడిని. మనకు మరో కొడుకు లేడనే లోటును అఖిల్ తీరుస్తాడులే అని సురేఖతో చెప్పాను' అని చిరంజీవి భావోద్వేగంగా చెప్పారు.

     పెద్దనాన్న థ్యాంక్స్:

    పెద్దనాన్న థ్యాంక్స్:

    హలో ఈవెంట్‌లో రాంచరణ్-అఖిల్ మధ్య ఉన్న అనుబంధం కూడా హైలైట్ గా నిలిచింది. స్టేజీ పైకి వచ్చాక.. చిరంజీవి, చరణ్ లను చూసి అఖిల్ కొద్దిసేపు ఫ్రీజ్ అయిపోయాడు. భావోద్వేగంతో ఏమి మాట్లాడకలేకపోయాడు.

    ఆ తర్వాత తేరుకుని.. 'మా పెదనాన్న చిరంజీవికి.. మా పెద్దన్నయ్య రామ్ చరణ్ కు థ్యాంక్స్' అని చెప్పడంతో మెగా అభిమానులు కూడా అఖిల్ వ్యాఖ్యలకు ఫిదా అయిపోయారు.

     ఆప్యాయత-అనుబంధం:

    ఆప్యాయత-అనుబంధం:

    నాగ్ చెప్పినట్లే వయసు రీత్యా అంతరం ఉన్నా.. చిరుతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఇది ఈ ఇద్దరికే పరిమితం కాలేదు.. చిరు-నాగ్ కుటుంబాల మధ్య చాలాకాలంగా స్నేహపూర్వక సంబంధాలున్నాయి. రక్త సంబంధీకులు కాకపోయినా.. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆప్యాయతలను చూస్తుంటే.. అంతకు తక్కువేమి కాదనిపిస్తోంది.

     డిసెంబర్ 22 రిలీజ్:

    డిసెంబర్ 22 రిలీజ్:

    విక్రమ్ కె కుమార్ గౌడ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ 'హలో' చిత్రం డిసెంబర్ 22న విడుదలకు సిద్దమైంది. తొలి సినిమా పరాభవం తర్వాత చేస్తున్న రెండో చిత్రం కావడంతో.. ఈ సినిమాతో ఎలాగైనా తొలి విజయం అందుకోవాలనుకుంటున్నాడు అఖిల్. గతంలో విక్రమ్ కె కుమార్ సినిమాలు చేసిన మేజిక్ రీత్యా.. 'హలో' మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా నిలిచిపోతుందనే అంచనాలు ఉన్నాయి.

    English summary
    Megastar Chiranjeevi speech was the highlight at Hello pre release event on Wednesday. He remembered his family's attachment with Nag family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X