లైవ్ ఛాట్: అఖిల్ తో గా మాట్లాడుకుంటున్నారా?
హైదరాబాద్:అఖిల్ అక్కినేని హీరోగా నటించిన చిత్రం 'అఖిల్'. ది పవర్ ఆఫ్ జువా అన్నది ట్యాగ్ లైన్. సాయేషా సైగల్ హీరోయిన్. వి.వి.వినాయక్ దర్శకుడు. నితిన్ నిర్మాత. ఈ నెల 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్ర హీరో అఖిల్ ... అభిమానులతో లైవ్ ఛాట్ సెషన్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ప్రకటన చూడండి.
అగ్నిగోళాన్ని సైతం తన చేతుల్లో ఇముడ్చుకోగల ధీశాలి ఆ కుర్రాడు. భగ భగ మండే సూర్యుడిని తలపించే అతని పయనం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగిందో తెలియాలంటే 'అఖిల్' చిత్రాన్ని చూడాల్సిందే.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.


Click it and Unblock the Notifications











