అఖిల్ సినిమా లేటెస్ట్ న్యూస్!
'అఖిల్', 'హలో' చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు అక్కినేని అఖిల్. చిన్న విరామం తరువాత తన మూడో చిత్రానికి శ్రీకారం చుట్టారు. తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకి అట్లూరి ఇప్పుడు అఖిల్ మూడో చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. అఖిల్, హలో సినిమాల తరువాత అఖిల్ చెయ్యబోతున్న సినిమా ఇదే. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్ర షూటింగ్ యు.కె లో ఈనెల (మే) చివరివారం నుండి మొదలు కాబోతోందని సమాచారం. ఈ చిత్రానికి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్ లో జరిగాయి. వెంకి అట్లూరి చెప్పిన పాయింట్ నచ్చడంతో నాగార్జున ఈ కథను ఓకే చేశారని సమాచారం.

మొదటి సినిమా తోనే అందరి ప్రశంసలందుకున్న దర్శకుడు వెంకి అట్లూరి నెక్స్ట్ సినిమా అక్కినేని వారసుడి తో చెయ్యడం విశేషం. ఈ సినిమాతో పాటు అఖిల్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. వర్మ ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు త్వరలో మీడియాకు తెలియజేయనున్నాడు. వరుస సినిమాలు సైన్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు అక్కినేని అఖిల్.


Click it and Unblock the Notifications











