క్రేజీ పిల్ల ప్రియా వారియర్‌తో అఖిల్.. ఇద్దరూ కలసి.. ఇది నిజమేనా!
అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన కెరీర్ లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. తొలి రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. కానీ అఖిల్ రెట్టించిన ఉత్సాహంతో కొత్త చిత్రాల్లో నటిస్తున్నాడు. అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ప్రేమ కథగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ మంచి అంచనాలు ఉన్నాయి. తొలి చిత్రంతోనే అఖిల్ తన లుక్స్ తో అదరగొట్టాడు. తాజాగా అఖిల్, కన్నుగీటిన మలయాళీ సంచలనం ప్రియవారియర్ గురించి ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది.

రొమాంటిక్ ప్రేమ
తొలి రెండు చిత్రాల్లో అఖిల్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండే చిత్రాల్లో నటించాడు. తాజగా వెంకీ అట్లూరి దర్శత్వంలో నటిస్తున్న చిత్రం రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

బ్రాండ్‌గా మారుతున్న అఖిల్
అఖిల్ యంగ్ హీరోగా, ఫ్యూచర్ టాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు కూడా అఖిల్ ని ఇప్పటినుంచే ఉపయోగించుకోవడం ప్రారంభిస్తున్నాయి. అఖిల్ ఇప్పటికే కొన్ని సంస్థల ఉత్పత్తులకు ఎండార్స్మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మలయాళీ పిల్లతో
అఖిల్, కన్నుగీటిన మలయాళీ సంచలనం ప్రియవారియర్ గురించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. వీరిద్దరూ కలసి ఓప్రముఖ సంస్థకు బ్రాండింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క వీడియోతో ప్రియవారియర్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది. అఖిల్ యువతని ఆకర్షించే సత్తా ఉన్న నటుడు. దీనితో వీరిద్దరిని ఓ షాపింగ్ మాల్ ప్రచారానికి ఉపయోగించుకోబోతున్నట్లు తెలుస్తోంది.

షాకింగ్ రెమ్యునరేషన్
ఈ ప్రచారం కోసం వీరిద్దరికి షాకింగ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉన్న ప్రియవారియర్ కు రూ కోటి, అఖిల్ కు 75 లక్షలు పారితోషకం ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

త్వరలో సినిమాల్లో
ప్రియవారియర్ ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు అందుకుంటోంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రియవారియర్ ని తమ చిత్రాల్లో తీసుకునేందుకు సౌత్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. సరైన సమయం వస్తే అఖిల్, ప్రియా వారియర్ జంటగా నటించినా ఆశ్చర్యం అవసరం లేదు.


Click it and Unblock the Notifications











