తనపై వస్తున్న రూమర్స్ పై అక్కినేని అఖిల్ స్పందన
ఈ విషయమై అఖిల్ మాట్లాడుతూ... "నేను ఇప్పటిదాకా ఎటువంటి సినిమాను అంగీకరించలేదు. నా మొదటి సినిమాకు సిద్ధపడుతున్నాను" అని తెలిపాడు. ఇప్పటికే రాజమౌళి కుమారుడు కార్తీక్... అఖిల్ తో ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. మాటీవీ షార్ట్ ఫిలింస్ కంటెస్ట్ లో ఆ షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారని చెప్పుకుంటున్నారు.
నాగచైతన్య ఎంట్రీ విషయంలో నాగార్జున అంచనాలు తారుమారయ్యాయి. చైతన్య తొలి చిత్రం'జోష్' అపజయాన్ని మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో అఖిల్ విషయంలో అలా జరుగకూడదని నాగార్జున భావిస్తున్నారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆమోదించదగ్గ సబ్జెక్టు, స్క్రీన్ ప్లేను రాజమౌళి తో రెడీ చేయిస్తున్నాడని టాక్.
మా మీద అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం. గ్రీకువీరుడు, తడాఖా ఆడియో వేడుకలకు అభిమానులు వచ్చారు. ఇప్పుడు 'అడ్డా'కు వచ్చారు. వచ్చే ఏడాది జరిగే అఖిల్ సినిమా పాటల వేడుకకు ఇలాగే వస్తారు అంటూ నాగార్జున 'అడ్డా' ఆడియో పంక్షన్ లో స్టేజ్ పై చెప్పారు. దాంతో వచ్చే సంవత్స రం ఖచ్చితంగా అఖిల్ ఎంట్రీ ఉంటుందని తేలిపోయింది. ఈనేపథ్యంలో అఖిల్ విషయంలో అలా జరుగకూడదని నాగార్జున భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












