వందేళ్ల చరిత్రలో అఖిల్ ది రికార్డు నాగార్జున
నాగార్జున తన కుమారుడు అఖిల్ క్రికెట్ లో చూపే ప్రతిభాపాటవాలు చూసి మురిసిపోతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...క్రికెట్ అంటే అఖిల్‌కు చాలా ఇష్టం. అందుకే ఆస్ట్రేలియాలో రెండేళ్లు శిక్షణ తీసుకొన్నాడు. అక్కడి ఆకాడెమీలో 14 యేళ్లకే కెప్టెన్ అయ్యాడు. వందేళ్ల చరిత్రలో అక్కడ ఇదొక రికార్డు" అన్నారు. అలాగే అఖిల్‌ని భవిష్యత్తులో క్రికెట్ ఆటగాడిగా చూడాలనుకొంటున్నారా అని అడిగితే...ఇదే చెయ్యమని నేనెప్పుడూ చెప్పను. తనకు ఏది ఇష్టమైతే అది చేస్తాడు. ఇక అఖిల్ కి సచిన్ అంటే చాలా ఇష్టం. వాడి కోసమే సచిన్‌తో స్నేహం చేశా. ఆ పరిచయంతోనే తారల టీ20 మ్యాచ్‌కు సచిన్‌ను ఆహ్వానించా. ఆయన రాలేదు కానీ...మాకు క్రికెట్ బ్యాట్లు, ప్యాడ్స్, గ్లోవ్స్ పంపించారు. సచిన్ వాటిపై ప్రత్యేకంగా సంతకం కూడా చేశారు. మ్యాచ్ కు ముందురోజే అవి మాకు చేరాయి. ఆటలో వాటినే ఉపయోగించుకొన్నాం కూడా అన్నారు. అదీ విషయం.


Click it and Unblock the Notifications











