పెళ్లి గురించి స్పందించిన అఖిల్, అమ్మానాన్న గర్వపడేలా చేయడమే లక్ష్యమన్న అక్కినేని స్టార్
Recommended Video

నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ తొలి సినిమా విషయంలో తెబ్బతిన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఎవరూ ఊహించని విధంగా చిన్న వయసులోనే పెళ్లికి సిద్ధమై తాను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ యంగ్ హీరో చివరి నిమిషయంలో పెళ్లి రద్దు చేసుకుని అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.
తొలి సినిమా ప్లాప్, పెళ్లి డిస్ట్రబెన్స్ నుండి బయటపడి..... తన రెండో సినిమాతో మళ్లీ ఫ్రెష్‌గా కెరీర్ మొదలు పెట్టిన అఖిల్ డిసెంబర్ 22న 'హలో' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

చివరి నిమిషంలో ఫిక్సైన అఖిల్, విక్రమ్ కుమార్
ప్రస్తుతం ‘హలో' సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఇది ఇంట్రడక్షన్ సాంగ్ కాదని అఖిల్ తెలిపారు. ఈ పాట అవసరం అని దర్శకుడు, నేను చివరి నమిషంలో డిసైడ్ అయ్యామని, అందుకే ఈ పాటను షూట్ చేస్తున్నట్లు అఖిల్ వెల్లడించారు.

ఈ సినిమా నాకు న్యూ బిగినింగ్
నా తొలి సినిమా విషయంలో నేనేమీ బాధ పడటం లేదు. ఆ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. తొలి సినిమా విషయంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట నిజమే. ప్రస్తుతం నేను చేస్తున్న ‘హలో' మూవీ నా కెరీర్‌కు న్యూ బిగినింగ్‌లాగా ఉంది అని అఖిల్ అక్కినేని తెలిపారు.

నాన్న అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకుంటున్నారు
‘హలో' మూవీ విషయంలో నాన్న స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాను ఆయన నిర్మించడంతో పాటు అన్ని సరిగ్గా ఉండేలా చూసుకుంటున్నారు. మా నాన్నే మాకు గ్రేటెస్ట్ గైడ్, మెంటర్. నా తొలి సినిమా హోమ్ ప్రొడక్షన్లో చేయాల్సింది.... అని అఖిల్ అన్నారు.

ఆయనే మా హీరో, టెంపర్ తగ్గించుకున్నా
చిన్న తనం నుండి అన్నయ్యకు, నాకు ఒకరే హీరో. ఆయనే మా నాన్న. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల్లో ఆయన గైడెన్స్ తీసుకుంటాం. ఒకప్పుడు నాకు బాగా టెంపర్ ఉండేది. ఇపుడు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని అఖిల్ తెలిపారు.

ఆయనతో నాకు పోటీ ఏంటి?
‘హలో' మూవీ రిలీజ్ అవుతున్న రోజే సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హై' మూవీ విడుదలవుతోంది. దీనిపై అఖిల్ స్పందిస్తూ ఆయనతో నాకు పోటీ ఏమిటి. ఆయన పెద్ద హీరో. నా కెరీర్ ఇప్పుడే మొదలైంది. నా మొదటి సినిమా కూడా సల్మాన్ భాయ్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాతో పాటు విడుదలైంది. ఇపుడు రెండో సినిమా కూడా ఆయన సినిమాతోనే విడుదలవుతోంది. ఈ విషయం సల్మాన్ భాయ్ తో కూడా మాట్లాడాను. దీన్ని నేను క్లాష్ గా భావించడం లేదు. ప్రేక్షకులు రెండు సినిమాలను ఆదరిస్తారని నమ్ముతున్నాను అని అఖిల్ తెలిపారు.

పెళ్లి గురించి స్పందించిన అఖిల్
మ్యారేజ్ ప్లాన్స్ ఏమిటి? అని అఖిల్‌ను అడగ్గా... ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నా ఫోకస్ అంతా నా కెరీర్ మీదనే ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. నా మొదటి లక్ష్యం నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడం, మా నాన్న మాదిరిగా కెరీర్ బిల్డ్ చేసుకోవడం... అని అఖిల్ తెలిపారు.

‘హలో’ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్
ఇటీవల విడుదలైన ‘హలో' మూవీ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











