ఆమె లేకుంటే ఏంటి అంటూ అక్కినేని హీరో.. వెనుకడుగేయకుండా సిద్దమయ్యాడు
సినీ వారసులుగా ఇండస్ట్రీలో కాలు మోపిన ప్రతీ హీరో ఏదో ఒక సినిమాతో సెన్సేషన్ కావడం, ఆ తర్వాత అనతికాలంలోనే స్టార్ హీరోగా అవతరించడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు స్టార్ వారసులకు మాత్రం ఇది పెద్దగా కలిసిరావడం లేదు. వారసత్వం అనే బ్యాక్ సపోర్ట్ తో పాటు బాగా పుషింగ్ ఇచ్చే అభిమాన వర్గం ఉన్నప్పటికీ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకొని సరైన బ్రేక్ తెచ్చుకోలేకపోతున్నారు కొందరు స్టార్ వారసులు.
ఆ లిస్టులో అక్కినేని వారబ్బాయి అక్కినేని అఖిల్ కూడా ఒకరు. తాత నుంచి తండ్రి, అన్నా వదినా వరకు అంతా సినీ తారలే కావడం ఈయనకు బాగా కలిసొచ్చే అంశమే అయినా కెరీర్ లో ఓ మైలురాయి లాంటి సినిమా పడకపోవడం ఈ హీరో దురదృష్టమని చెప్పుకోవాలి. తన పేరు మీదే 'అఖిల్' అంటూ వెండితెరపై మొదటిసారి హీరో అవతారమెత్తాడు అఖిల్. ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో రెండేళ్ల గ్యాప్ తీసుకొని హలో అంటూ దిగాడు. ఇది కూడా డిసాస్టర్ కావడంతో ఇటీవలే మిస్టర్ మజ్ను అనే రొమాంటిక్ సినిమాతో పలకరించాడు అఖిల్. ఈ సినిమా అఖిల్ కి కాస్త ఉరటనిచ్చి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో అదే జోష్ కంటిన్యూ చేయాలని ఈ సారి స్టార్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమాకు కమిట్ అయ్యాడు అఖిల్.

అఖిల్ నాలుగో సినిమాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కనుంది. గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. చిత్రానికి మంచి హైప్ తీసుకురావాలని అఖిల్ సరసన కియారా అద్వానీ, రష్మిక మందన్న లాంటి క్రేజి హీరోయిన్ల పేర్లు పరిశీలించారట. ఇప్పటికే పలు సినిమాలకు కమిటైన ఆ ఇద్దరూ డేట్స్ సర్దుబాటు కాక నో చెప్పడంతో మరో హీరోయిన్ వేటలో పడ్డారు దర్శకనిర్మాతలు. ఇంకా హీరోయిన్ ఫైనల్ కాకపోయినప్పటికీ ఈ నెల 24 నుంచి షూటింగ్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. మొదటి షెడ్యూల్ అంతా హీరోయిన్ లేకుండా అఖిల్ తోనే నడిపించనున్నారట. చూడాలి మరి అఖిల్ సరసన చివరకు ఏ హీరోయిన్ కన్ఫమ్ అవుతుందో!


Click it and Unblock the Notifications











