అఖిల్, వినాయిక్ చిత్రం ప్రారంభం (ఫొటోలు)
హైదరాబాద్ : ఈ రోజు ఎప్పుడెప్పుడా అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ చిత్రం లాంచ్ అయ్యిన సంగతి తెలిసిందే. మీడియాకు దూరంగా.... కుటుంబ సభ్యులు, శ్రేయాభిలాషుల సమక్షంలో ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ముహూర్తం చేసారు. ఈ చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తూండగా, నితిన్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నితిన్ ఖారారు చేసి తెలిపారు. వినాయిక్ తల్లి, అనారోగ్యం, హఠాత్ మరణంతో ఈ చిత్రం ప్రారంభం వాయిదాపడుతూ వచ్చింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక అక్కినేని అఖిల్ ను హీరోగా పరిచయం చేసే భాధ్యతను తనపై ఉంచిన నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని దర్శకుడు వివి వినాయిక్ తెలిపారు. శ్రీ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
లాంచింగ్ ఫొటోలు...

ముహూర్త సమయం
డిసెంబర్ 17, ఉదయం 9 గంటల 10 నిముషాలకు ఈ భారీ చిత్రం ముహూర్తం జరిగింది.

తల్లి అమల చేతుల మీదుగా...
అక్కినేని అఖిల్ తల్లి అమల చేతుల మీదుగా...క్లాప్ ని ఇచ్చి ఈ చిత్రం ప్రారంభించారు.

కెమెరా స్విచ్చాన్
అక్కినేని అఖిల్ సోదరుడు అక్కినేని నాగ చైతన్య కెమెరా స్విఛాన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసారు.

తండ్రి దర్శకత్వంలో
తండ్రి నాగార్జున ఫస్ట్ షాట్ కు డైరక్ట్ చేసారు. ముహూర్తం షాట్ ని అఖిల్ పై చిత్రీకరించారు.

గంటలో 2 లక్షల క్లిక్ లు..
నిర్మాత సుధాకర్ రెడ్డి మమాట్లాడుతూ...ఈ చిత్రం ముహూర్తం షాట్ తీసినట్లు అఖిల్,నితిన్ లు ట్విట్టర్ లో పెట్టగానే ఒక్క గటంలో 2 లక్షలు క్లిక్ లు వచ్చాయంటే ఈ చిత్రంపై ఏ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో అర్దమైంది. వారి అంచనాలని అందుకునేలా..అద్బుతమైన సినిమాగా దీన్ని రూపొందిస్తాం అన్నారు.

సుధాకర్ రెడ్డి కంటిన్యూ చేస్తూ..
నాగార్జున గారు అఖిల్ ఫస్ట్ పిక్చర్ చేసే అవకాసం మా సంస్ధకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వివి వినాయిక్ గారు ఈ సినిమాను చాలా పెద్ద స్ధాయిలో ప్లాన్ చేసారు అన్నారు.

వినాయిక్ మాట్లాడుతూ...
ఫ్యాంటసీ నేపధ్యంలో సాగే ప్రేమ కథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్బుతమైన స్క్రిప్టు ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాధోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలెడతాం. అభిమానులు కోరుకునే మాస్,మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి అన్నారు.

అఖిల్ మాట్లాడుతూ...
‘గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నేను హీరోగా పరిచయమవుతున్న సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. నా డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ & సుధాకర్ రెడ్డిలకు అల్ ది బెస్ట్. వీరితో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం అయినందుకు క్షమించండి.' అని అన్నారు.

నిర్మాత నితిన్ మాట్లాడుతూ....
ఈ రోజు మంచి ముహూర్తం వుండటం వలన తొలి షాట్ చిత్రీకరించాం. జనవరి మొదటివారంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్ గా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించే అవకాశాన్ని మా చేతుల్లో పెట్టినందుకు నాగార్జున గారికి మరియు నా సోదరుడు అఖిల్ కు థాంక్స్. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. భారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి. అని అన్నారు.

నాగచైతన్య ట్వీట్ చేస్తూ.,.
" నా బేబీ బ్రదర్ అఖిల్ అక్కినేని కు శుభాకాంక్షలు... తొలి చిత్రం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను..రాక్ బ్రో !" అన్నారు.

ఫాలోయింగ్...
మరో ప్రక్కన ఇంకా హీరోగా అరంగేట్రం చేయకుండానే అక్కినేని అఖిల్‌కు ఫాలోయింగ్ ఎక్కువైంది. ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు. అఖిల్‌కు అంత క్రేజ్ ఉంది కాబట్టే టైటాన్ వాచ్ కంపెనీ, మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు అఖిల్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంటున్నాయి.

శుభాకాంక్షలు..
తాత, తండ్రి, సోదరుడు తరహాలో అఖిల్ కూడా ఈ చిత్రం తో పెద్ద హిట్ కొట్టి ... దూసుకుపోవాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











