అఖిల్ ఎంగేజ్మెంట్, పెళ్లికి కొందరే.... రిసెప్షన్ కి అందరినీ పిలుస్తాం : అక్కినేని ఫ్యామిలీ ప్రకటన
అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని జి.వి.కె. కుటుంబానికి చెందిన శ్రియ భూపాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని జి.వి.కె. కుటుంబానికి చెందిన శ్రియ భూపాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్ ఎంగేజ్‌మెంట్ డిసెంబర్ 9న జరగనుంది.
ఈ ఎంగేజ్‌మెంట్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అక్కినేని కుటుంబ వేడుకగా జరపబోతున్నారు. వివాహం తర్వాత జరిగే రిసెప్షన్‌ను గ్రాండ్ లెవల్‌లో చేసేందుకు అక్కినేని ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది. రిసెప్షన్‌కు అందదరినీ ఆహ్వానించబోతున్నట్లు అక్కినేని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

అఖిల్ వివాహం ఇటలీలో...
అఖిల్ పెళ్లి ఇటలీలోని ప్లాన్ చేస్తున్నారు. శ్రేయా భూపాల్ కుటుంబీకుల కోరిక మేరకే పెళ్లి ఇటలీలో ఘనంగా చేసేందుకు నిర్ణయించుకున్నారని టాక్. ఈ వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా 600మంది అతిథులు వస్తారని తెలుస్తోంది. వారందరికి ఇటలీలో 7 స్టార్ ఆతిథ్యంతో ఘనంగా విందు ఏర్పాటు చేయనున్నారట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ.... రోమ్ నగరంలో అఖిల్ వివాహం జరిగే అవకాశం ఉందని తెలిపారు. వివాహ వేదిక ఖరారుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

తన హాట్ ఫ్రెండ్ టబుకు కబురు పెట్టిన నాగ్... అఖిల్ కోసమా?
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, హీరోయిన్ టబు.... ఫ్రెండ్‌షిప్ అందరికీ తెలిసిందే. నాగార్జునతో కలిసి 'నిన్నే పెళ్లాడుతా'తో పాటు మరికొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తర్వాత ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అక్కినేని ఫ్యామిలీకి కూడా టబు చాలా దగ్గరయింది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ
తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున తనపై వస్తున్న రూమర్స్ తో హర్ట్ అయ్యాడు. వెంటనే ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. అక్కినేని నాగార్జున తన పేరు మీద, అన్నపూర్ణ స్టూడియోస్ మీద పలు బ్యాంకుల వద్ద చాలా అప్పులు తీసుకున్నాడని, వాటిని కట్టకుండా ఎగ్గొట్టాడంటూ ప్రచారం మొదలైంది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?
ఇదంతా అందరికీ తెలిసిందే కదా.... అఖిల్ కు కాబోయే భార్యకు, నితిన్ లవ్ ఎఫైర్ కు లింకేటి అనుకుంటున్నారా? వస్తున్నాం.. వస్తున్నాం... ఆ మ్యాటర్లోకే వస్తున్నాం. అఖిల్, నితిన్ మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీయ భూపాల్ ను నితిన్ కు పరిచయం చేసాడట... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











