»   » శ్రీయాభూపాల్‌తో రిలేషన్‌పై అల్లు శిరీష్ క్లారిటీ.. వారి మధ్య అలాంటి బంధమా?

శ్రీయాభూపాల్‌తో రిలేషన్‌పై అల్లు శిరీష్ క్లారిటీ.. వారి మధ్య అలాంటి బంధమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్, జీవికే రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్ కలిసి ఓ పార్టీలో హంగామా చేయడం మీడియాలో హల్‌చల్ రేపింది. ఎందుకంటే శ్రియా భూపాల్ ‌తో అఖిల్ పెళ్లి ఇటీవల క్యాన్సిల్ కావడమే అందుకు కారణం. అల్లు శిరీష్, శ్రియా భూపాల్ మధ్య సంబంధమేమిటీ అనే ప్రశ్న అభిమానులను, నెటిజన్లు వెంటాడింది. ఓ దశలో అఖిల్, శ్రీయా రిలేషన్ బ్రేకప్ కావడానికి కారణం అల్లు శిరీష్ అనే రూమర్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. దానిపై సోషల్ మీడియాలో అల్లు శిరీస్ క్లారిటీ ఇచ్చాడు.

అఫైర్ రూమర్..

అఫైర్ రూమర్..

అఖిల్‌తో బ్రేకప్ తర్వాత శిరీష్‌తో అఫైర్ పెట్టుకొన్నదా అనే సందేహం వచ్చింది కొందరికి. అంతేకాకుండా నానా రకాలుగా ఊహించుకొన్నారు. అఖిల్ మాజీ లవర్‌తో శిరీష్ సంబంధమేమిటనే వాదన మొదలైంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో అల్లు శిరీష్ ట్వీట్ ద్వారా వివరణ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.

క్లారిటీ ఇచ్చిన శిరీష్

శ్రీయా భూపాల్‌తో ఉన్న రిలేషన్‌పై అల్లు అర్జున్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. నా స్నేహితుడు శరత్‌రెడ్డి, నా బేబీ సిస్టర్ శ్రీయతో వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేశాను. Friendsfor Life అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. దాంతో అల్లు శిరీష్, శ్రీయాల బంధంపై స్పష్టమైన అవగాహన వచ్చేసింది. డబుల్ మీనింగ్ సందేశాలతో రెచ్చిపోయిన వారి నోళ్లకు తాళం పడింది.

అఖిల్‌తో బ్రేకప్..

అఖిల్‌తో బ్రేకప్..

అక్కినేని వారసుడు అఖిల్‌తో శ్రీయాభూపాల్ నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. పెళ్లి తేదీ సమీపిస్తుండగా వ్యక్తిగత విభేదాల కారణంగా వారి పెళ్లి క్యాన్సిల్ అయింది. దాంతో ఇరు కుటుంబాల్లోనూ బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సెలబ్రిటీల మ్యారేజీ క్యాన్సిల్ కావడంపై పలువురు షాక్ గురయ్యారు.

శ్రీయాకు ఎన్నారై సంబంధం..

శ్రీయాకు ఎన్నారై సంబంధం..

ఆ తర్వాత శ్రియాభూపాల్‌కు ఎన్నారై వరుడితో పెళ్లి కుదిరిందనే వార్తలు మీడియాలో ప్రచారమయ్యాయి. జీవికే ఫ్యామిలీ తీసుకొచ్చిన సంబంధాన్ని శ్రీయా ఓకే చేసిందని రూమర్ వైరల్ అయింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న శ్రీయా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

రెండో సినిమాపై అఖిల్..

రెండో సినిమాపై అఖిల్..

ప్రస్తుతం అఖిల్ పెళ్లి మాట ఎత్తకుండా కెరీర్‌పై దృష్టిపెట్టాడు. అఖిల్ సినిమా దారుణంగా ఫ్లాపైన తర్వాత రెండో చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విలన్‌గా అజయ్ కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నాడు.

కెరీర్‌పై శిరీష్ దృష్టి

కెరీర్‌పై శిరీష్ దృష్టి

టాలీవుడ్‌లో శ్రీరస్తు, శుభమస్తు సినిమా తర్వాత మలయాళంలో మోహన్‌లాల్ కలిసి 1971 బియాండ్ బార్డర్ అనే చిత్రంలో నటించాడు. అయితే ఆ చిత్రం తర్వాత ప్రస్తుతం వీఐ ఆనంద్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

English summary
Allu Shirish has given clarity over Shriya Bhupals Relations. He said Shriya is my baby sister. Me and my friend Sharat Reddy, Shirya enjoyed weekend party, Shirish tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu