సముద్రపు ఒడ్డున దారుణమైన పని.. హెల్ప్ అంటూ అరుపులు.. అఖిల్ సార్థక్ శాడిజం!
బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరూ ఫుల్ ఫాంలో ఉన్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే బుల్లితెర, వెండితెర మీద అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అయితే ఇందులో సోహెల్, అఖిల్, మోనాల్, హారిక, అరియానా వంటి వారు సిల్వర్ స్క్రీన్ మీద మెరిసేందుకు రెడీ అవుతున్నారు. పలు సినిమాల్లోఅవకాశాలతో బిగ్ బాస్ కంటెస్టెంట్లు దూసుకుపోతోన్నారు.

అందరూ అలా..
సోహెల్ ఇప్పటికే ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన వారిలో మొదటగా ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది సోహెల్. షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టింది కూడా సోహెల్. హీరోగా రాబోతోన్న ఈ మొదటి ప్రాజెక్ట్‌పై సోహెల్ అంచనాలుపెట్టుకున్నాడు. మోనాల్, అరియానా, హారిక, దివిలకు కూడా పలు ఆఫర్లు వచ్చాయి.

అఖిల్ ఇలా..
అఖిల్ మోనాల్ కలిసి ఓ వెబ్ సిరీస్ కోసం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగబ్బాయి.. గుజరాత్ అమ్మాయి అంటూ బిగ్ బాస్ షోలో కుదిరిన మ్యాజిక్‌ను మళ్లీ తెరపై చూపించేందుకు రెడీ అయ్యారు. అయితే తాజాగా అఖిల్ తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను తెలిపాడు.

స్టార్ బాయ్ అంటూ..
అఖిల్ తనకు తానే స్టార్ బాయ్ అనే బిరుదు ఇచ్చుకున్నట్టున్నాడు. స్టార్ బాయ్ పేరిట తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చాడు. హీరోగా మొదటి చిత్రమంటూ ఫుల్ ఎగ్జైట్ అయిన అఖిల్ ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ రాబోతోందని నిన్న ప్రకటించాడు. చెప్పినట్టుగానే నేడు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు.
వెరైటీ పోస్టర్..
ఫస్ట్ టైం అంటూ వదిలిన ఈ ఫస్ట్ లుక్ వెరైటీగా ఉంది. ఇందులో హీరోయిన్‌ను సముద్రపు ఒడ్డున కాలు పట్టి లాక్కెళ్లిపోతూ తనలోని శాడిజాన్ని చూపించాడు అఖిల్. ఇక అఖిల్ నుంచి తప్పించుకునేందుకు హెల్ప్ అంటూ హీరోయిన్ అరుస్తున్నట్టు కనిపిప్తోంది. మొత్తానికి ఫస్ట్ లుక్‌తోనే అందరి దృష్టి పడేలా చేసుకున్నాడు అఖిల్. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు, కథ స్క్రీన్ ప్లే అన్ని బాధ్యతలను కూడా హేమంత్ తన భుజాన వేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











