25 ఏళ్ల లోపు ఆ పని చేయాలని అనుకున్నా.. అఖిల్ సార్థక్ మామూలోడు కాదు!

బిగ్ బాస్ షోలోకి వచ్చాకే అఖిల్ సార్థక్ అనే పేరు బయటకు వచ్చింది. జనాలకు అఖిల్ సార్థక్ అనే నటుడున్నాడని తెలిసి వచ్చింది. బిగ్ బాస్ కంటే ముందు కొన్ని సీరియల్స్, సినిమాలు చేసినా కూడా ఎవ్వరికీ అతని గురించి తెలియదు. బిగ్ బాస్ వల్లే నేడు ఈ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అఖిల్ సోషల్ మీడియాలో స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నాడు. ఏజ్ చిన్నదే అయినా ఇమేజ్ మాత్రం భారీగానే ఉంది.

పాతికేళ్ల కుర్రాడు..

పాతికేళ్ల కుర్రాడు..

బిగ్ బాస్ షోలో అఖిల్ వయసు మీద పదే పదే చర్చలు జరిగాయి. మోనాల్ అఖిల్ అలా క్లోజ్‌గా ఉండటంతో నెటిజన్లు సెటైర్లు వేసేవారు. సోహెల్ అఖిల్ మధ్య వయసురిత్యా ఎంతో గ్యాప్ ఉండటం.. అయినా కూడా సోహెలే అఖిల్‌ను అన్నా, బ్రదర్ అని సంబోధించడంతో వయసు గురించి ఎప్పుడూ చర్చలు వచ్చేవి.

అదే గొడవ..

అదే గొడవ..

అభిజిత్ అఖిల్ మధ్య అయితే ఎప్పుడూ కూడా ఏజ్, ఓరేయ్ అరేయ్.. అన్నారంటూ గొడవలు, చదువుల గురించి గొడవల పడుతూఉండేవారు. నీలాంటి వాళ్లను ఎంతో మందిని చూశాను నువ్ నాముందు బచ్చాగాడివి అని అభిజిత్.. నీకు ఇక్కడి వరకు అంత ఏజ్ పట్టింది నేను 25ఏళ్లకే ఇక్కడి వచ్చానంటూ అఖిల్ ఇలా ఎప్పుడూ వయసు గురించి ప్రస్థావించేవారు.

తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

తాజాగా అఖిల్ ఓ పోస్ట్ చేశాడు. అందులో తన కలను, తనకు తాను వేసుకున్న ప్రామీస్‌ను నిలబెట్టుకున్నట్టు చెప్పుకొచ్చాడు. పాతికేళ్ల లోపు తనకు తాను సొంతంగా కారు కొనుక్కోవాలనే కలగన్నాడట. మొత్తానికి అది నెరవేర్చుకున్నాడు. ఈ మేరకు ఓ పోస్ట్ చేశాడు.

పాతికేళ్ల లోపు..

పాతికేళ్ల లోపు..

నాకు పాతికేళ్లు వచ్చే లోపు.. కారు కొనుక్కుంటానని నాకు నేను ప్రామిస్ వేసుకున్నాను. అది మొత్తానికి నిలబెట్టుకున్నాను. ఇదంతా నా హార్డ్ వర్క్ వల్లే జరిగింది. అంకితభావం, నా తల్లి తండ్రుల మద్దతు, అభిమానుల ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైందంటూ అఖిల్ ఎమోషనల్ అయ్యాడు.

అదే నమ్ముతాను..

అదే నమ్ముతాను..

అయినా కష్టపడి పని చేస్తే ఏదైనా జరుగుతుందని నమ్ముతుంటాను. సాధించేవరకు కష్టపడి పని చేస్తూనే ఉంటాను. అఖిల్ ఫ్యామిలీలో భాగస్వామి అయిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. సీరియస్‌గా మీ అందరిపై నాకు ఎంతో ప్రేమ ఉంది.. జై శ్రీ రామ్ అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X