twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా చార్జింగ్ తగ్గిపోయింది, ఇక చెలరేగిపోతా, నాన్న సారీ...(ఆడియో వేడుకలో అఖిల్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆటాడుకుందాం..రా'. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనాగ్ కార్పోరేష‌న్, శ్రీజి ఫిలింస్ బ్యాన‌ర్స్ పై చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు, ఎ.నాగ సుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

    అనూప్ మ్యూజిక్ అందించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఆటాడుకుందాం...రా ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్ శిల్ప క‌ళావేదిక‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి అక్కినేని అఖిల్ ముఖ్య అతిధిగా హాజ‌రై ఆటాడుకుందాం...రా ఆడియోను ఆవిష్క‌రించగా...ఆటాడుకుందాం...రా ట్రైల‌ర్ ను హీరో సుమంత్ రిలీజ్ చేసారు.

    అక్కినేని అఖిల్‌ మాట్లాడుతూ '' రెండో సినిమా చేసే ముందు నాకు చార్జింగ్‌ తగ్గిపోయింది. ఈ సినిమాలో చేయడం వల్ల మళ్లీ చార్జింగ్‌ అయినట్టు ఉంది. మా ఫ్యామిలీలో ఒకరు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యుంటే అది అనూపే అనుకోవచ్చు. మా సినిమాలన్నింటికీ ప్రాణం పోసేస్తాడు. మా నాన్నకు తమ్ముడిలా అన్నయ్యకు అన్నయ్యలా పనిచేస్తాడు. సుశాంత్‌ను సూశీ అని పిలుస్తాను. తనకు సినిమాలు తప్ప వేరే లోకమే ఉండదు. ఈ సినిమా తనకు పెద్ద హిట్‌ మూవీ అవుతుంది' అన్నారు.

    నాన్న గారు ఈ ఫంక్ష‌న్ కి రావాలి అనుకున్నారు కానీ...అమితాబ్ గారితో ముంబాయిలో యాడ్ షూటింగ్ ఉండ‌డం వ‌ల‌న రాలేదు. ఈ షంక్ష‌న్ కి రాలేక‌పోయినందుకు సారీ చెప్ప‌మ‌న్నారు అని అఖిల్ తెలిపారు.

    స్లైడ్ షోలో అఖిల్ మాట్లాడిన మరిన్ని విశేషాలు, ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోస్..

    చెలరేగిపోతా..

    చెలరేగిపోతా..

    మా ధైర్యం, బ‌లం అభిమానులే. ఇక నుంచి మ‌న సినిమాలు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. అభిమానులంద‌ర్నీ చూసిన త‌ర్వాత ఎన‌ర్జి వ‌చ్చింది. ఇక నేను చెల‌రేగిపోతాను అన్నారు. సుశాంత్ డేడికేషన్ నాకు బాగా నచ్చుతుంది. ఎంటైర్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

    హీరో సుమంత్ మాట్లాడుతూ...

    హీరో సుమంత్ మాట్లాడుతూ...

    సుశాంత్ డెడికేష‌న్ ని మెచ్చుకోవాలి, నాకు బాగా నచ్చతుంది. డ్యాన్స్, ఫైట్స్ లో సుశాంత్ హార్డ్ వ‌ర్క్ క‌నిపిస్తుంది. నాగేశ్వ‌రెడ్డి తెర‌కెక్కించిన ఈడోర‌కం ఆడోర‌కం చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేసాను. నా సినిమా రెడీగా ఉంది. సెప్టెంబ‌ర్ లో కానీ.. అక్టోబ‌ర్ లో కానీ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాను. అలాగే చైత‌న్య రెండు సినిమాలు, చిన మావ‌య్య సినిమా కూడా రెడీ అవుతుంది అన్నారు. అక్కినేని ఫ్యాన్ ఎలా చూడాలనుకుంటారో అలా కనపడతాను అన్నారు.

    హీరో సుశాంత్ మాట్లాడుతూ...

    హీరో సుశాంత్ మాట్లాడుతూ...

    చిన మావ‌య్య హిట్ కొడుతున్నాం అని చెప్పి మరీ సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో హిట్ కొట్టారు. చిన మావ‌య్య చెప్పిన‌ట్టుగా నేను చెప్ప‌లేను కానీ..ఈ సినిమా ఖ‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంది అన్నారు.

    అమ్మ చాలా కష్టపడింది...

    అమ్మ చాలా కష్టపడింది...

    ఈ సినిమాకి అమ్మ చాలా క‌ష్ట‌ప‌డింది. అమ్మ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. శ్రీనివాస్ అంకుల్ ఫ‌స్ట్ సినిమా నుంచి స‌పోర్ట్ చేస్తున్నారు. సినిమాని బాగా ప్ర‌మోట్ చేస్తారు. ప్ర‌తి సినిమాకి బాగా క‌ష్ట‌ప‌డ‌తారు. ఆయ‌న‌ క‌ష్టం, న‌మ్మ‌కంకు త‌గ్గ‌ట్టు గుర్తింపు రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు సుశాంత్

    బ్రహ్మానందం గురించి..

    బ్రహ్మానందం గురించి..

    బ్ర‌హ్మానందం గారు నువ్వు హిట్ కొట్టాలి అని చెప్పి న‌న్ను స‌పోర్ట్ చేస్తూ ఈ సినిమా చేసారు. ఇక ఈ మూవీకి అనూప్ చాలా మంచి ట్యూన్స్ అందించాడు. అలాగే టైమ్ మిష‌న్ సెట్ చాలా బాగా వేసారు. ఆడియోన్స్ ను బాగా ఆక‌ట్టుకుంటుంది అన్నారు సుశాంత్.

    కథ

    కథ

    శ్రీధ‌ర్ సీపాన క‌థ చెప్పిన‌ప్పుడు ఫ‌స్ట్ సిట్టింగ్ లోనే ఓకే చేసాను. అంత బాగా న‌చ్చింది. ఈ క‌థ‌ను డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి గారు మ‌రో లెవ‌ల్ కి తీసుకువెళ్లారు అన్నారు.

    ఫ్యాన్స్ గర్వ పడేలా..

    ఫ్యాన్స్ గర్వ పడేలా..

    ఫ్యాన్స్ న‌న్ను ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా చూపించారు. మీరు గ‌ర్వ‌ప‌డేలా ఉండ‌డానికి ట్రై చేసాను అన్నారు సుశాంత్.

    అందుకే ఆలస్యం

    అందుకే ఆలస్యం

    మ‌న‌సుకి న‌చ్చిన సినిమాలు చేయాల‌నుకుంటాను అందుచేత సినిమా సినిమాకి ఆల‌స్యం అవుతుంది అన్నారు.

    ఆ ఇద్దరూ..

    ఆ ఇద్దరూ..

    ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య స్పెష‌ల్ అప్పీరెన్స్ ఉంటుంది. నేను అడిగిన వెంట‌నే ఓకే అని చెప్పి చేసిన చైత‌న్య‌కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. అలాగే అఖిల్ కూడా ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నాడు.

    అదృష్టం

    అదృష్టం

    ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు. అన్న‌పూర్ణ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన చిత్రానికి వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నారు.

    డైరెక్ట‌ర్ జి.నాగేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ...

    డైరెక్ట‌ర్ జి.నాగేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ...

    సుశాంత్ తో నాలుగేళ్ల క్రిత‌మే సినిమా చేయాలి కానీ... మిస్ అయ్యింది. ఆత‌ర్వాత నుంచి చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు గారు నాతో ట‌చ్ లోనే ఉండి సినిమా చేద్దాం అన్నారు. లేట్ అయినా సుశాంత్ తో మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది అన్నారు.

    అలాంటి సంస్థలో..

    అలాంటి సంస్థలో..

    తెలుగు ఇండ‌స్ట్రీకి పునాది అయిన‌ అన్న‌పూర్ణ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన చిత్రానికి వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. అన్న‌పూర్ణ సంస్థ‌లో వ‌ర్క్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు నాగేశ్వరరావు.

     టెక్నీసియన్స్

    టెక్నీసియన్స్

    ఇది టెక్నీషియ‌న్స్ సినిమా. అనూప్ ఎక్స్ ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించాడు. కెమెరామెన్ శివ‌ బాగా కోప‌రేట్ చేయ‌డంతో సినిమా బాగా రిచ్ గా వ‌చ్చింది. నారాయ‌ణ రెడ్డి అద్భుత‌మైన టైమ్ మిష‌న్ సెట్ ఇచ్చారు. నేను ఈ సినిమాని ఇంత బాగా తీయ‌డానికి ఎన‌ర్జి సుశాంత్. ఈ సినిమా ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంది అన్నారు. ఈసారి డెఫినెట్ గా హిట్ కొడుతున్నాం అన్నారు.

    నిర్మాత నాగ సుశీల మాట్లాడుతూ...

    నిర్మాత నాగ సుశీల మాట్లాడుతూ...

    సాంగ్స్ చూసాను. ఈసారి డెఫినెట్ గా హిట్ కొడుతున్నాం. అనూప్ మా ఫ్యామిలీ మెంబ‌ర్. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం గారు చాలా మంచి క్యారెక్ట‌ర్ చేసారు. నేను ఫోన్ చేసి అడిగిన వెంట‌నే ఇంకేమి మాట్లాడ‌కుండా చేస్తాను అన్నారు ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మానందం గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఈ చిత్రాన్ని అంద‌రూ చూసి ఆద‌రించాలి అని కోరుకుంటున్నాను అన్నారు. మంచి టీమ్ తో రూపొందించిన చిత్రం ఆటాడుకుందాం...రా

    బ్ర‌హ్మానందం మాట్లాడుతూ...

    బ్ర‌హ్మానందం మాట్లాడుతూ...

    సుశాంత్ చాలా టాలెంటెడ్ హీరో. ఈ సినిమాలో సుశాంత్ న‌టించిన‌ తీరు చాలా బాగుంది. నేను ఈ సినిమాలో చాలా పెద్ద క్యారెక్ట్ చేసాను. యంగ్ డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి గురించి చెప్పాలంటే....అత‌ను ప్రొడ్యూస‌ర్స్ డైరెక్ట‌ర్. మా క‌మెడియ‌న్స్ అంద‌రికీ మంచి క్యారెక్ట‌ర్స్ ఇచ్చి ప్రొత్స‌హిస్తుంటాడు. ఇక నాగేశ్వ‌రెడ్డికి కామెడీ సీన్స్ బాగా రాసే రైట‌ర్ శ్రీధ‌ర్ సీపాన క‌లిస్తే ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఇందులో వ‌ప‌ర్ ఫుల్ ప్యాక్ట్ కామెడీ ఉంది. నా త‌మ్ముడు ర‌ఘుబాబు, పృధ్వీ, వెన్నెల కిషోర్...ఇలా క‌మెడియ‌న్స్ అంద‌రూ న‌టించిన ఈ సినిమాని చూస్తున్నంత సేపు ఆడియోన్స్ న‌వ్వుతూనే ఉంటారు అన్నారు.

    నటీనటులు

    నటీనటులు

    సుశాంత్‌, సోనమ్‌ ప్రీత్‌ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్‌ అబ్బాసి, సుధ, ఆనంద్‌, రమాప్రభ, రజిత, హరీష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

    తెర వెనక

    తెర వెనక

    చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: వెంకట్‌,రామ్‌ సుంకర, ఛీఫ్‌ కో-డైరెక్టర్‌. డి.సాయికృష్ణ, కో-డైరెక్టర్‌: కొండా ఉప్పల, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రవికుమార్‌ యండమూరి, కథ-మాటలు: శ్రీధర్‌ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

    English summary
    Sushanth, Sonam Preeth acting Aatadukundam Raa Movie Audio launch held at Shilpa Kala Vedika in Hyderabad today (05th Aug) evening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X