»   » ఇండస్ట్రీ టాక్: అఖిల్ విషయంలో నాగార్జున నిర్ణయం మంచిదే!

ఇండస్ట్రీ టాక్: అఖిల్ విషయంలో నాగార్జున నిర్ణయం మంచిదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని చిన్నోడు అఖిల్ కొన్ని రోజులుగా తన పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా మీడియాలో ఫోకస్ అవుతున్నాడు. ఆ హడావుడిలో పడి ఆయన తర్వాత సినిమా విషయం గురించి అంతా మరిచిపోయారు. అఖిల్ తన రెండో సినిమా 'మనం' దర్శకుడు విక్రమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.

తన ప్రియురాలు శ్రేయ భూపాల్ తో నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి రద్దు అంశంలో బాగా డిస్ట్రబ్ అయిన... వీలైనంత త్వరగా షూటింగులో బిజీ అయిపోయి ఆ డిస్ట్రబెన్స్ నుండి బయట పడాలని ప్లాన్ చేసుకుంటున్నాడట.

అఖిల్ తొలి సినిమా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... పెద్ద ప్లాప్ అయి అఖిల్ తొలి ప్రయత్నాన్ని భారీగా దెబ్బ కొట్టింది. అందుకే రెండో సినిమా విషయంలో ప్రయోగాల జోలికి పోకుండా మినిమమ్ గ్యారంటీ కథను ఎంచుకున్నాడు. ముఖ్యంగా తొలి సినిమా మాదిరిగా ఏ విషయంలోనూ ఓవర్ చేయకుండా... సగటు తెలుగు ప్రేక్షకుడు మెచ్చేలా సినిమాను తెరకెక్కించబోతున్నారట.

నాగార్జున నిర్ణయం మంచిదే

నాగార్జున నిర్ణయం మంచిదే

విక్రమ్ కుమార్ మీద పూర్తి నమ్మకం ఉంచిన నాగార్జున...అఖిల్ రెండో సినిమా విషయంలో అసలు ఎలాంటి జోక్యం చేసుకోకూడదని, దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిదే అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు.

పెళ్లి రద్దు డిస్ట్రబెన్స్

పెళ్లి రద్దు డిస్ట్రబెన్స్

గత పది రోజులుగా అక్కినేని ఫ్యామిలీలో సందడి అంతా మాయమైంది. ఎవరూ ఊహించని విధంగా ఉన్నట్టుండి అఖిల్ పెళ్లి రద్దవ్వడమే ఇందుకు కారణం అని అంటున్నారు. ఈ ఘటనతో నాగార్జున చాలా అప్ సెట్ అయ్యారని, సినిమా సెట్స్ లో కూడా ఆయన ప్రవర్తన గతంలో ఎన్నడూ లేని విధంగా విచిత్రంగా ఉంటోందని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున రాజుగారి గది 2 సినిమాలో చేస్తున్నారు. సెట్స్ లో ఎప్పుడూ సరదాగా ఉండే నాగార్జున ఇపుడు చాలా మూడీగా ఉంటున్నారని, తన షూటింగ్ పోర్షన్ పూర్తవ్వగానే ఎవరితో మాట్లాడకుండా ఓ మూలన కూర్చుంటున్నారని తెలుస్తోంది.

పెళ్లి రద్దు: అఖిల్‌నే తప్పుపడుతున్నారు, చైతు-సమంతకు కొత్త తలనొప్పి!

పెళ్లి రద్దు: అఖిల్‌నే తప్పుపడుతున్నారు, చైతు-సమంతకు కొత్త తలనొప్పి!

పెళ్లి రద్దు విషయంలో అందరూ అఖిల్ నే తప్పు పడుతున్నారు. మరో వైపు ఈ సంగటన నాగ చైతన్య, సమంతలకు కొత్త తలనొప్పిగా తయారైందట. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అఖిల్ పెళ్లి కేన్సిల్ ఇష్యూ.... అవకాశం కూడా ఇవ్వని అమల అక్కినేని!

అఖిల్ పెళ్లి కేన్సిల్ ఇష్యూ.... అవకాశం కూడా ఇవ్వని అమల అక్కినేని!

టాలీవుడ్లో ఇపుడు మోస్ట్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే... అది అఖిల్ అక్కినేని పెళ్లి రద్దు అంశమే. ప్రముఖ వ్యాపారవేత్త జీవికె రెడ్డి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి శ్రీయా భూపాల్‌తో అఖిల్ ప్రేమాయణం, చిన్న వయసులోనే పెళ్లిపై నిర్ణయం తీసుకోవడం.... ఓ సంచలనం. నిశ్చితార్థం కూడా పూర్తయి మరికొన్ని రోజుల్లో పెళ్లి వేడుక జరుగుతుంది అనే సమయంలో వీరిద్దరు పెళ్లి రద్దు చేసుకున్నారనే వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Akhil started seriously working for his second film and doing a very tough exercise. His father Nagarjuna finalised Vikram Kumar as the director for this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu