వావ్ : మేగజైన్‌పై అఖిల్ అక్కినేని హాట్ లుక్ (ఫోటో)
హైదరాబాద్: అఖిల్ అక్కినేని మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. నాగార్జున వారసుడిగా త్వరలో వెండితెరకు పరిచయం కాబోతున్న ఈ హీరో తాజాగా ‘వావ్' అనే మేగజైన్ కవర్ పేజీపై హాట్ లుక్ తో దర్శనమిచ్చారు. సదారు మేగజైన్ 12వ వార్సికోత్సవం సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్ కవర్ పేజీపై ‘అఖిల్ అక్కినేని-స్టార్ సన్ ఆన్ ది రైజ్' అనే శీర్షికతో అఖిల్‌ను ప్రజంట్ చేసారు. అకిల్ కాస్ట్యూమ్స్, లుక్ అదిరిపోయింది.

అఖిల్ త్వరలో చేయబోయే సినిమా గురించి...
వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంకు వెలిగొండ శ్రీనివాస్ కథ అందిస్తున్నారు. ఈ చిత్రం ఓ సోషియో ఫాంటసీ అని తెలుస్తోంది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' తరహాలో ఈ చిత్రం ఉండబోతోందని వినికిడి. పై లోకం నుంచి వచ్చిన హీరోయిన్ తో ఇక్కడ తిరిగే లోకల్ కుర్రాడు ప్రేమాయణమే కథనం అంటున్నారు. అందులో యాక్షన్ ఎలిమెంట్స్ , కామెడీని సైతం మిక్స్ చేసారంటున్నారు. కోన వెంకట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించనున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ అందించిన కథతో గతంలో నాగార్జున హీరోగా ఢమురకం చిత్రం వచ్చింది. అలాగే రామ్ చేస్తున్న పండుగ చేస్కో చిత్రానికి సైతం వెలిగొండ కథనే అందిస్తున్నారు.
అక్కినేని అఖిల్ లాంచింగ్ కోసం అక్కినేని కుటుంబ అభిమానులే కాకుండా తెలుగు సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఆ క్షణాలు దగ్గరపడ్డాయని సమాచారం. అఖిల్ చివరకు వివి వినాయిక్ దర్శకత్వంలో నే ఫైనల్ చేసారని ఫిల్మ్ నగర్ వార్త. అయితే హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదని అంటున్నారు. అది కనుక సెట్ అయితే త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ గా లాంచింగ్ ప్రకటన రానున్నదని సమాచారం.
రీమిక్స్ సాంగ్ లు ఇప్పటి సినిమాల్లో ముఖ్యంగా తెలుగులో కామన్ అయ్యిపోయాయి. తమ వారసలు చిత్రాల్లో తమ పాటలను రీమిక్స్ చేసి పెట్టడం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి రీమిక్స్ ని ఒకటి అఖిల్ చిత్రంలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ పాట మరేదో కాదు...అక్కినేని నాగార్జున హిట్ చిత్రం హలో బ్రదర్ లోని కన్నె పిట్టరో..కన్ను కొట్టరో అనే పాట అని తెలుస్తోంది. ఈ పాట అప్పట్లో సూపర్ హిట్. ఇప్పుడు ఆ పాటను రీమిక్స్ చేసి ఈ తరానికి అందించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు.
ఈ ప్రపోజల్ దర్శకుడు వివి వినాయిక్ అని తెలుస్తోంది. వివి వినాయిక్ గతంలో చిరంజీవి హిట్ సాంగ్ శుభలేఖ రాసుకున్నా పాటని రామ్ చరణ్ నాయక్ లో పెట్టి హిట్ కొట్టారు. ఈ రీమిక్స్ కు నాగార్జున సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. తమన్ ఈ పాటని రెడీ చేస్తున్నారు. ఈ మద్యకాలంలో వచ్చిన మనంలోనూ నాగేశ్వరరావుగారి ఓల్డ్ క్లాసిక్..నేను పుట్టాను ని రీమిక్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.


Click it and Unblock the Notifications











