Don't Miss!
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
అఖిల్ బిగ్ బడ్జెట్ మూవీ.. కొత్త హీరోయిన్ ఫిక్స్ అయినట్లేనా?
అక్కినేని యువ హీరో అఖిల్ ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చాలానే కష్టపడుతున్నాడు గాని అంచనాలకు తగ్గట్లుగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోతున్నాడు. మొదట సినిమా అఖిల్ తో పాటు ఆ తరువాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా పెద్దగా లాభాలు అంధించలేదు. ఇక ఫైనల్ గా ఫామ్ లో లేని బొమ్మరిల్లు భాస్కర్ తో చేతులు కలిపి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాను చేసిన విషయం తెలిసిందే.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని అఖిల్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్న సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. బడ్జెట్ కూడా అఖిల్ మార్కెట్ కు మించి పెడుతున్నాడు. అయితే ఆ సినిమాలో అఖిల్ కు జోడిగా స్టార్ హీరోయిన్ నటిస్తుందని మొదట్లో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక బడ్జెట్ ఇప్పటికే ఎక్కువ అయ్యిందని హీరోయిన్ విషయంలో నిర్మాతలు తగ్గినట్లు సమాచారం.
కొత్త హీరోయిన్ ని తీసుకోవడం బెటర్ అని ముంబైకు చెందిన మోడల్ ను ఫిక్స్ చేశారట. ఆమె పేరు సాక్షి వైద్య అని తెలుస్తోంది. కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కానీ ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చి షూటింగ్ స్పీడ్ పెంచాలని అనుకుంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి.