హలో అంటూ వ‌స్తున్నాం.. బ్లాక్ బ‌స్ట‌ర్ కొడుతున్నాం..ఇది ఫిక్స్.. నాగార్జున ధీమా వెనుక కారణం అదేనా?

By Rajababu

Recommended Video

నాగ్ ధీమా వెనుక కారణం అదేనా?

ప్రతిష్మాత్మక సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో ఏ సినిమా రూపొందింనా ఓ స్థాయిలో ప్రమోట్ చేయడంలో అక్కినేని నాగార్జునది ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. తన కుమారుడు అఖిల్ నటించిన హలో చిత్రం డిసెంబర్‌ 22న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతున్నది. సాధారణంగా సినిమా గురించి డిఫరెంట్‌గా ప్రమోట్ చేసే నాగ్.. తాజాగా వైజాగ్‌లో జరిగిన ఆడియో ఫంక్షన్‌లో ఓ అడుగు ముందు వేసి సినిమా బ్లాక్‌బస్టర్ అని డిక్లేర్ చేశాడు. ఈ సినిమా విజయంపై ఉన్న ధీమాను వ్యక్తం చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాగార్జున వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

 చైతూకి మాట ఇచ్చాను..

చైతూకి మాట ఇచ్చాను..

కింగ్ నాగార్జున మాట్లాడుతూ - ''అఖిల్‌తో దగ్గరుండి సినిమా చేస్తానని మాటిచ్చాను. అఖిల్‌ సినిమా కంటే ముందుగా చైతన్యతో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' అనే సినిమా చేశాను. అదే ఆడియో వేడుకలో `వస్తున్నాం..కొడుతున్నాం..`అని చెప్పాను. అన్నట్టే హిట్ కొట్టాం. అది పూర్తయిన తర్వాత అఖిల్‌తోఈ సినిమా చేసే పనిలోనే ఉన్నాను అని అన్నారు.

 దేవుడిలా విక్రమ్ కుమార్

దేవుడిలా విక్రమ్ కుమార్

మా మనసుకు దగ్గరైన డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌. మా నాన్నగారి ఆఖరి సినిమా ఎలా తీయాలి?. తెలుగు ప్రేక్షకులు హృదయాల్లో లెజెండ్‌గా నిలిచిపోయిన నాన్నగారి ఆఖరి సినిమా ఎలా తీయాలనుకుంటుండగా, నాకు దేవుడులా వచ్చిన విక్రమ్‌కుమార్‌ నాతో మనం లాంటి సినిమా చేశాడు. నాన్నగారిని ఎంతో గొప్పగా సాగనంపాడు.

 అఖిల్ రీలాంచ్

అఖిల్ రీలాంచ్

ఇప్పుడు అఖిల్‌ని ఈ సినిమాతో రీలాంచ్‌ చేస్తున్నాను. అఖిల్‌ను ఎలా చూడాలనుకున్నాను అనే విషయాన్ని విక్రమ్‌తో చెబితే తను `హలో` సినిమాను తయారు చేశాడు. అక్కినేని అభిమానులు అఖిల్‌ను ఎలా చూడాలనుకుంటారో అలాగే ఈ సినిమాలో చూస్తారు. అలాగే విక్రమ్‌ కుమార్‌ను చైతన్యతో సినిమా చేయమని ముందుగానే అడిగాను. అన్నపూర్ణ స్టూడియోలో నెక్స్‌ట్‌ మూవీ విక్రమ్‌ దర్శకత్వంలో నాగచైతన్యతో ఉంటుంది. ఇదే ప్రేమతో ఆ సినిమా కూడా చేస్తాం.

 కల్యాణి నటన అద్భుతం

కల్యాణి నటన అద్భుతం

చాలా రోజుల క్రితం 'హలో గురు ప్రేమ కోసమేరా జీవితం..' అని ప్రియన్‌గారు నన్ను, అమలను కలిపారు. డెస్టినీ అంటారో ఏమో కానీ, ఇప్పుడు ప్రియదర్శన్‌ అమ్మాయి క‌ల్యాణి ..అఖిల్‌తో సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో కల్యాణి అద్భుతంగా నటించింది. తనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది.

 నాన్న చూసుకొన్నారు..

నాన్న చూసుకొన్నారు..

ఈ వేడుక‌కు ముందు వైజాగ్‌లో తుఫాన్‌ ఉందన్నారు. కానీ అన్నపూర్ణ టీం సభ్యులు 'మీరు వైజాగ్‌ వెళ్లండి సార్‌..పైన నాన్నగారున్నారు. ఆయన చూసుకుంటారు' అన్నారు. అదే భరోసాతో ఇక్కడికి వచ్చాను. మ్యాజిక్‌ జరిగింది. ఏం కాలేదు. మాకు వైజాగ్‌, రాజమండ్రి, కాకినాడ అంటే నాకు ప్రాణం. నేనైతే ఎన్నో సినిమాలను ఇక్కడ షూటింగ్‌ చేశాను.

 బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం

బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం

హలో సినిమా మొదలయ్యేటప్పుడు ఎలాగైనా అఖిల్‌, అభిమానులకు హిట్ సినిమా ఇస్తాన‌ని..ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అనుకున్నాను. మూడు రోజుల క్రితమే సినిమాను చూశాను. `వస్తున్నామూ..బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడుతున్నాం...ఇది ఫిక్స్‌'' అన్నారు.

 అఖిల్ లైవ్ షో..

అఖిల్ లైవ్ షో..

అక్కినేని అభిమానులు, ప్రేక్ష‌కుల న‌డుమ వైజాగ్ సాగ‌ర తీరంలో వైభవంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలోమ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ పాట‌ల‌కు లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌డ‌మే కాకుండా ప్రేక్ష‌కుల‌ను సింఫ‌నీ మ్యూజిక్ లైవ్ షోతో అల‌రించారు. ఇక యూత్ కింగ్ అఖిల్ మెరిసే మెరిసే అనే సాంగ్‌కు స్టేజ్‌పై స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌డ‌మే కాకుండా `ఏవేవో క‌ల‌లు క‌న్నా..ఏ వైపో క‌దులుతున్నా...ఏమైందో తెలియ‌కున్నా..ఎన్నెన్నో జ‌రుగుతున్నా..` అనే బ్యూటీఫుల్ సాంగ్‌ను లైవ్‌లో పాడి అంద‌రినీ అల‌రించారు.

 డిసెంబ‌ర్ 22 కోసం వెయిటింగ్‌

డిసెంబ‌ర్ 22 కోసం వెయిటింగ్‌

అక్కినేని అమల మాట్లాడుతూ - ''చాలా చాలా ఆనందంగా ఉంది. అనూప్‌ రూబెన్స్‌ గారి మ్యూజిక్‌ అద్భుతం. సినిమాటోగ్రాఫర్‌ వినోద్‌గారు ప్రతి సీన్‌ను అద్భుతంగా తీశారు. కల్యాణికి అద్భుతమైన భవిష్యత్‌ ఉంటుంది. విక్రమ్‌కి ఇదొక గ్రేట్‌ సక్సెస్‌గా నిలుస్తుంది. అక్కినేని అభిమానులతో పాటు నేను కూడా డిసెంబర్‌ 22 కోసం వెయిట్‌ చేస్తున్నాను. ఆల్‌ ది బెస్ట్‌ టు యూనిట్‌'' అన్నారు.

 అదృష్టంగా భావిస్తున్నాను..

అదృష్టంగా భావిస్తున్నాను..

హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శన్‌ మాట్లాడుతూ - ''ఇది నా మొదటి సినిమా. తెలుగు భాష అంటే ఇష్టంతో మాట్లాడటం నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు, నాగార్జునగారి వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. నాగార్జునగారు ఎంతో కేర్‌ తీసుకుని నన్ను గైడ్‌ చేశారు. డైరెక్టర్‌ విక్రమ్‌గారి దర్శకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అఖిల్‌ అమేజింగ్‌ కోస్టార్‌. చాలా సపోర్ట్‌ చేశారు. అనూప్‌గారు అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చారు. థాంక్యూ ఆల్‌'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X