నాన్న రక్తం ధారపోస్తున్నాడు.. అఖిరా ఎమోషనల్ ట్వీట్.. పవన్‌, నాగబాబుకు అండగా రంగంలోకి అల్లు అర్జున్

Recommended Video

Allu Arjun Extends His Support To Nagababu And Janasena || Filmibeat Telugu

ఏపీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. జనసేనకు ఇతర సినీ నటుల నుంచి మద్దతు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులే పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే తండ్రి నాగబాబుకు కొణిదెల నిహారిక గోదావరి జిల్లాలలో ప్రచారం నిర్వహిస్తుంటే.. నాన్న పవన్ కల్యాణ్‌కు ఆసరగా నిలిచేందుకు అఖిరా నందన్‌ ఎన్నికల బరిలోకి దూకుతున్నాడు. అల్లు అర్జున్ నైతికంగా మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

జనసేన పార్టీకి మద్దతుగా అల్లు అర్జున్

జనసేన పార్టీకి మద్దతుగా అల్లు అర్జున్

జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సేవనందించేందుకు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన నాగబాబుకు నా హృదయపూర్వక శుభాభినందనలు. రాజీకీయ ప్రయాణంలో విజయం సాధించాలని కోరుకొంటున్నాను. ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా మీకు తోడుగా నిలువకపోయినప్పటికీ, నైతికంగా మీతోనే ఉన్నాం అని అల్లు అర్జున్ ఓ ప్రకటనలో తెలిపారు.

 విజయంతో తిరిగి రావాలని

విజయంతో తిరిగి రావాలని

ప్రజాశ్రేయస్సుకు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం. ప్రత్యక్షంగా తాము అందుబాటులో లేకపోయినా మీకు మా సంపూర్ణ సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ప్రచారంలో దూసుకుపోవాలని ఆశిస్తున్నాం. విజయంతో తిరిగి రావాలని కోరుకొంటున్నాం అని అల్లు అర్జున్ అన్నారు.

ప్రజల జీవితాల్లో పవన్‌ కల్యాణ్‌

ప్రజల జీవితాల్లో పవన్‌ కల్యాణ్‌

జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్‌కు నా హృదయపూర్వకంగా మద్దతు తెలియజేస్తున్నాను. రాజకీయ ప్రయాణంలో ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఏపీ ప్రజల జీవితాల్లో పవన్ కల్యాణ్ కొత్త కాంతిని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం సఫలమవుతుందని నమ్ముతున్నాను అని అల్లు అర్జున్ పేర్కొన్నాు.

పవన్ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని

పవన్ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని

పవన్ కల్యాణ్ డైనమిక్‌ లీడర్ షిప్, బ్రిల్లియంట్ విజన్ ప్రజలకు మంచి చేస్తుందని, ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకువస్తుందని నమ్ముతున్నాను. ఆయన ఆశయాలు, ఆకాంక్షలు నెరవెరుతాయని నేను బలంగా నమ్ముతున్నాను అని అల్లు అర్జున్ తన ప్రకటనలో తెలిపారు.

అఖిరానందన్ ఉద్వేగంగా ట్వీట్

అఖిరానందన్ ఉద్వేగంగా ట్వీట్

ఇక పవన్ కల్యాణ్ పడుతున్న కష్టాన్ని చూసి ఆయన తనయుడు అఖిరా నందన్ భావోద్వేగమైన ట్వీట్ చేశారు. కొద్ది రోజులు నిద్రహారాలు లేవు. విశ్రాంతి లేకుండా ఆయన శ్రమిస్తున్న తీరు చూస్తే కంట్లో నీరు ఉబికి వస్తున్నది. డీహైడ్రేషన్‌తో బాధపడుతూ కూడా తెనాలి సభకు హాజరుకాబోతున్నారు. ఓ మనిషి ఎంత మేరకు కష్టపడాలో అంత మేరకు శ్రమిస్తున్నాను. ప్రజల కోసం ధారపోస్తున్నాడు అని అఖిరా నందన్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X