అఖిల్ బిగ్ బడ్జెట్ మూవీ.. మొదలయ్యేది ఎప్పుడంటే?
అక్కినేని చిన్నోడు అఖిల్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అవుతున్న విషయం తెలిసిందే. మొదటి అడుగులోనే కెరీర్ కు గట్టి దెబ్బ పడింది. అన్నయ్య స్టైల్ లోనే కొన్ని స్టోరీస్ తో సక్సెస్ అందుకోవాలని అనుకున్నాడు గాని పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మొదటి సారి ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో బలమైన బాక్సాఫీస్ హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు.
సురేందర్ రెడ్డి లాంటి మాస్ కమర్షియల్ దర్శకుడు హీరోలను ఏ స్థాయిలో ప్రజెంట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కిక్, రేసుగుర్రం, ధృవ వంటి సినిమాలతో అగ్ర దర్శకుడిగా క్రేజ్ అందుకున్న సురేందర్ రెడ్డి గత ఏడాది సైరా సినిమాతో ఒక విధంగా పరవలేదనిపించాడు. అయితే ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ తో మరో హిట్ కొట్టడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా షూటింగ్ మార్చ్ మొదటి వారంలో మొదలు కానుంది. ఇన్ని రోజులు చిత్ర యూనిట్ పలు ప్రీ ప్రొడక్షన్ పనులతో చాలా బిజీగా గడిపింది.

ఈ సినిమా కోసం అఖిల్ గుఱ్ఱపు స్వారీ శిక్షణ కూడా తీసుకున్నాడు. అతనికి పర్సనల్ గా గిజెల్లే అనే పెంపుడు గుర్రం కూడా ఉంది. ఇటీవల ప్రాక్టీస్ సెషన్ కి సంబంధించిన ఒక వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. చూస్తుంటే డైరెక్టర్ రేసుగుర్రం ఫార్ములా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. మెగాస్టార్ తో సినిమా చేసిన తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి మరో స్టార్ హీరోతో సినిమా చేస్తాడని అంతా బావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా అఖిల్ ను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











