ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమా చేయను: అఖిల్‌

By Srikanya

హైదరాబాద్‌: క్రికెట్‌కు సంబంధించి సచిన్‌ తనకు దేవుడని ఆయన ఆటో బయోగ్రఫీని ఎట్టి పరిస్థితుల్లో సినిమా చేయనని, అఖిల్‌ అన్నాడు. అఖిల్ రెండో చిత్రంగా..ఈ బోయోపిక్ చేస్తారని, నాగార్జున ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు చాలా కాలంగా మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో అఖిల్ ఇలా స్పందించారు. సీసీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా అఖిల్‌ మాట్లాడుతూ.. వారియర్స్‌ జట్టుతోనే 'లగాన్‌'లాంటి చిత్రం తీస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ సీజన్‌లో వారియర్స్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇక మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ అఖిల్ తొలి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువ హీరో నితిన్ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ... ‘గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నేను హీరోగా పరిచయమవుతున్నాను. నా డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ & సుధాకర్ రెడ్డిలకు అల్ ది బెస్ట్. వీరితో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం అయినందుకు క్షమించండి.' అని అన్నారు.

Akil don't want to act as Sachin

నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించే అవకాశాన్ని మా చేతుల్లో పెట్టినందుకు నాగార్జున గారికి మరియు నా సోదరుడు అఖిల్ కు థాంక్స్. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. భారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి. అని అన్నారు.

ఇక అక్కినేని అఖిల్ ను హీరోగా పరిచయం చేసే భాధ్యతను తనపై ఉంచిన నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని దర్శకుడు వివి వినాయిక్ తెలిపారు. శ్రీ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

వినాయిక్ మాట్లాడుతూ... ఫ్యాంటసీ నేపధ్యంలో సాగే ప్రేమ కథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్బుతమైన స్క్రిప్టు ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాధోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలెడతాం. అభిమానులు కోరుకునే మాస్,మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి అన్నారు.

మరో ప్రక్కన ఇంకా హీరోగా అరంగేట్రం చేయకుండానే అక్కినేని అఖిల్‌కు ఫాలోయింగ్‌ ఎక్కువైంది. ప్రముఖ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు. అఖిల్‌కు అంత క్రేజ్‌ ఉంది కాబట్టే టైటాన్‌ వాచ్‌ కంపెనీ, మౌంటెన్‌ డ్యూ సాఫ్ట్‌ డ్రింక్‌ కంపెనీలు అఖిల్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X