పవన్ కొడుకు అకీరా గెస్ట్ రోల్(ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ త్వరలో మనకు పెద్ద తెరపై కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, హీరోయిన్ రేణు దేశాయ్ మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్' అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా రేణు దేశాయ్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత కూడా రేణునే. ఆ సినిమాలో అకిరా నందన్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా తెలియచేసింది.

రేణు దేశాయ్ ట్వీట్ చేస్తూ... ‘అకిరా నందన్ ‘ఇష్క్ వాలా లవ్' సినిమాలో గెస్ట్ రోల్లో నటిస్తున్నాడు. నా కుమారుడి తొలి సినిమా నా స్వీయ దర్శకత్వంలో తెరకేక్కడం చాలా సంతోషంగా ఉంది' అంటూ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ తన ఆనందాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా మరాఠీ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. తెలుగులో కూడా ‘ఇష్క్ వాలా లవ్'ను డబ్ చేస్తున్నట్టు గతంలో రేణు దేశాయ్ వెల్లడించారు.

Pawan Son

నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్‌తో ఆమె బంధం, వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్. ‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X