పవన్ కళ్యాణ్ పిల్లలతో టాలెంటెడ్ హీరో.. ఆద్య అల్లరి స్టిల్ మామూలుగా లేదు

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆయన వారసులకు సంబంధించిన ఫొటోస్ కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ కు సంబంధించిన వార్తలు ఈ మధ్య బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక ఒక టాలెంటెడ్ హీరోతో పవన్ పిల్లలు సరదాగా స్టిల్ ఇవ్వడం వైరల్ గా మారింది.

ఎంత బిజీగా ఉన్నప్పటికీ

ఎంత బిజీగా ఉన్నప్పటికీ

పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఖాళీ సమయాల్లో తన పిల్లలతో కూడా ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. హాలిడేస్ సమయాల్లో అకిరా నందన్, ఆద్య తరచుగా పవన్ కళ్యాణ్ తో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. షూటింగ్స్ కు కూడా వెళుతుంటారు.

నాన్న అంటే అధ్యకు చాలా ఇష్టం

నాన్న అంటే అధ్యకు చాలా ఇష్టం

ఇక ఆద్య అయితే పవన్ కళ్యాణ్ ను ఎంతగానో ఇష్టపడుతుందని రేణు దేశాయ్ చాలా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. నా నాన్న అనే గర్వం తనకు ఎంతగానో ఉంటుందని అలాగే మెగా ఫ్యామిలీతో కూడా ఆద్య, అకిరా చాలా క్లోజ్ గా ఉంటారని వివరణ ఇచ్చారు. నిహారిక కూతురు పెళ్లిలో కూడా ఈ ఇద్దరు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే.

శేష్ అన్నతో అకిరా, ఆద్య

శేష్ అన్నతో అకిరా, ఆద్య

ఇక రీసెంట్ గా ఆద్య, అకిరా ఒక టాలెంటేడ్ హీరోతో కలిసి సరదాగా గడిపారు. ఆ హీరో మరెవరో కాదు. అడవి శేష్. అకిరాకు ఇష్టమైన నటుడు కూడా అతనే. ఇక రీసెంట్ గా పిల్లలు అడివి శేష్ అన్నతో కలిసి ఎంజాయ్ చేసినట్లు రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు. ఆ పోటోలో ఆద్య అల్లరిగా స్టిల్ ఇచ్చింది.

అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ

అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ

అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో అతను నటనపై ఫోకస్ పెట్టె ఛాన్స్ లేదని చెప్పిన రేణు దేశాయ్ అతని దృష్టి మొత్తం ఎడ్యుకేషన్ పైనే ఉందని వివరణ ఇచ్చారు. ఇంతవరకు అకిరా హీరో అవుతాననే ఆలోచన కూడా బయటపెట్టలేదని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X