Akira Nandan: మహేష్ బాబు, పవన్ వారసుల లేటెస్ట్ లుక్స్ వైరల్.. ఏమి తెలియనట్టే ఉన్నారు కానీ..
సినిమా ఇండస్ట్రీలో వారసులపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి మొదటి సినిమాకు వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం మన ఇండస్ట్రీలో రాబోయే వారసుల లిస్టు అయితే పెద్దగానే ఉంది. అయితే అందులో ఎక్కువగా మాత్రం మహేష్ బాబు పవన్ వారసులపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వారికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

స్టార్స్ వారసులు
సినిమా ప్రపంచంలో స్టార్ హీరోల వారుసుల పైనే ఫ్యాన్స్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. హీరోలుగా వారు ఏ విధంగా కనిపిస్తారు అనే ఊహాగానాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు.

మహేష్ , పవన్ బంధం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా ఇండస్ట్రీలో దాదాపు ఓకే తరహాలో క్రేజ్ అయితే ఉంది. ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలయితే బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో అయితే ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాయి. ఇక వ్యక్తిగతంగా కూడా వీరు కలుసుకున్నప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు.

ఒకరికొకరు సపోర్ట్
పవన్ మహేష్ బాబు ఒకప్పుడు కొంత క్లోజ్ గా కూడా తిరిగారు. ముఖ్యంగా అర్జున్ సినిమాకు సంబంధించిన పైరసీ విషయంలో అందరికంటే ముందుగా స్పందించి మహేష్ బాబుకు సపోర్ట్ చేసింది మాత్రం పవన్ కళ్యాణ్. ఆ విషయాన్ని మహేష్ కూడా చాలాసార్లు చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో కూడా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

అనవసరపు ఫ్యాన్ వార్స్
ఇక ఇద్దరు స్టార్ హీరోలో ఫ్యాన్స్ మధ్య అప్పుడప్పుడు కొన్ని గొడవలు కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు గౌతమ్ ఘట్టమనేని అకిరా నందన్ లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్ మధ్యలో వార్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే విధంగా ఓవర్గం వారు అనవసరపు కామెంట్స్ చేసుకుంటూ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

అకిరా లేటెస్ట్ లుక్ వైరల్
అకిరా నందన్ లేటెస్ట్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అకిరా నందాన్ ఇటీవల 18 వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక అతను దాదాపు ఒక పవర్ఫుల్ లుక్ లోకి వచ్చేసాడు అని ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వింటేజ్ ఫోటోలను జతచేస్తూ జూనియర్ పవర్ స్టార్ తప్పకుండా ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేసేలా ఎంట్రీ ఇస్తాడు అని చెబుతున్నారు.

గౌతమ్ లుక్ కూడా వైరల్
అలాగే రీసెంట్ గా గౌతమ్ ఘట్టమనేని కూడా చాలా రోజుల తర్వాత బాహ్య ప్రపంచంలో కనిపించాడు. హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ సందర్భంగా కనిపించడంతో మీడియా అతన్ని ఫోకస్ చేసింది. ఇక గౌతమ్ బాబు కూడా మరో ఏడాది గడిస్తే 18వ వసంతంలోకి అడుగుపెడతాడు. కాబట్టి అతను కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఎంతో సమయం పట్టదు. మరి ఈ ఇద్దరి స్టార్ కిడ్స్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











