డబ్బింగ్ థియోటర్ లో పవన్ కొడుకు(ఫొటో)
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందర్ ...డబ్బింగ్ థియోటర్ కనిపించారు. తన తల్లితో కలిసి డబ్బింగ్ లో పాల్గొన్నారు. తన తల్లి రేణూ దేశాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇష్క్ వాలే లవ్ చిత్రంలో గెస్ట్ గా చేస్తున్న అకీరా చేత ఇలా డబ్బింగ్ చెప్తున్నారామె. చిత్రంలో అకీరా ది చిన్న పాత్రే అయినా కీలకమైందని అంటున్నారు. కేవలం ఒక సీన్ లోనే మాత్రమే అకీరా కనిపిస్తాడు అంటున్నారు. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
'ఇష్క్ వాలా లవ్' చిత్రం కథ,మాటలు స్వయంగా రేణునే అందించి తెరకెక్కించింది. ఈ కథ ఓ జంట కు చెందింది. ఇందులో ఓ సెంటిమెంటల్ కుర్రాడికి, క్రేజీ అమ్మాయికి జరిగే లవ్ స్టోరీ. ఈ పాత్రల వైరుధ్యాలే చిత్రానికి ప్రాణం అని చెప్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేయనుంది. ఇందులో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఉంది. అది మరేదో కాదు...

ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల కుమారుడు అకిరా నందన్ ముఖానికి రంగేసుకున్నాడు. తన తల్లి రేణుదేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మరాఠీ చిత్రం 'ఇష్క్ వాలా లవ్'లో అకిరా అతిథి పాత్రల్లో మెరవబోతున్నాడు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రేణుదేశాయ్ ట్విట్టర్‌లో ద్వారా ప్రకటించారు.
''నేను ముందుగా మాట ఇచ్చినట్లు ఈ రోజు తీపి కబురు చెబుతున్నా. నా కొడుకు అకిరా నందన్ 'ఇష్క్ వాలా లవ్'లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఓ తల్లిగా నా కొడుకుని డైరక్ట్ చేయడం ఆనందంగా ఉంది'' అంటూ రాసుకొచ్చారు రేణు దేశాయ్. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తామని ఇదివరకే రేణు దేశాయ్ చెప్పారు. అంటే అకిరా నటనను తెలుగు తెరపైనా చూసే అవకాశముంది.


Click it and Unblock the Notifications











