నవ్విన పవన్ కళ్యాణ్: కొడుకు అకీరా రిహార్సల్స్ (ఫోటోస్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ‘ఇష్క్ వాలా లవ్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ తనయుడు తెరంగ్రేటం అనగానే....పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అకీరాను తన దర్శకత్వంలో పరిచయం చేయడంపై రేణు దేశాయ్ స్పందిస్తూ...‘అకిరాను పరిచయం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. సినిమాలోని ఓ సన్నివేశంలో అఖిరా వయసున్న అబ్బాయి కావాల్సివచ్చింది. దాంతో నా కుమారుడ్ని పరిచయం చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. నా దర్శకత్వంలో అఖిరాను పరిచయం చేయడం సెంటిమెంట్‌గా ఫీలయ్యాను. అది నా జీవితకాలం గుర్తుంచుకునే మధురజ్ఞాపకంగా భావిస్తున్నాను' అన్నారు.
అకీరాను వెండితెరకు పరిచయం చేస్తున్న విషయం పవన్ కళ్యాణ్‌కు తెలియజేసినపుడు ఆయన బిగ్గరగా నవ్వారని రేణు దేశాయ్ తెలిపారు. భారతీయ వివాహ వ్యవస్థలో ఎన్నో మార్పులొస్తున్నాయి. ఇరవయేళ్ల క్రింది నాటి పరిస్థితులు నేడు లేవు. నేటితరం అమ్మాయిలకు పెళ్లి విషయంలో కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. వివాహం తమ కెరీర్‌కు ప్రతిబంధకంగా మారుతుందనే అభద్రతాభావంలో వారున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాల్ని చర్చిస్తూ ప్రేమ, పెళ్లి, కెరీర్‌పై నవతరం మనోభావాలకు దర్పణంలా ఇష్క్‌వాలా లవ్ చిత్రాన్ని రూపొందించానని చెప్పారు రేణూదేశాయ్.
స్లైడ్ షోలో అకీరా నందన్‌కు సంబంధిచిన ఆన్ లొకేషన్ ఫోటోలు...

హీరోయిన్‌తో కలిసి...
హీరోయిన్ సులగ్నా పాణిగ్రాహితో కలిసి షూటింగ్ సమయంలో సీన్ రిహార్సల్స్ చేస్తున్న అకీరా నందన్.

ఇట్టే పట్టేస్తున్నాడు...
అకీరా నందన్ ఏ డైలాగ్ అయినా ఇట్టే పట్టేస్తున్నాడట. అతని టాలెంట్ చూస్తుంటే భవిష్యత్తులో మంచి స్టార్ అవుతాడని అంటున్నారు.

తండ్రి అంటే ఇష్టం
తండ్రి పవన్ కళ్యాణ్ అంటే అకీరాకు ఎంతో ఇష్టం. భవిష్యత్తులో తండ్రిలా పెద్ద స్టార్ కావాలనుకుంటున్నాడట.

కొడుకు భవిష్యత్తుకు బాటలు
పవన్‌తో విడిపోయి నిర్మాతగా, దర్శకురాలిగా మారిన రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా నందన్, ఆధ్యాలే లోకంగా జీవిస్తోంది. వారి భవిష్యత్తుకు సినిమా మాట వేస్తోంది.


Click it and Unblock the Notifications











