twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘‘అమ్మా నేను నీ పక్షమే’’... రేణు దేశాయ్ గురించి అకీరా, కాబోయే భర్త ఏమన్నారంటే!

    |

    'అలీతో సరదాగా' కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పాల్గొన్నారు. ఈ షోలో ఆమె తన సినిమా రెరీర్, పర్సనల్ లైఫ్, పిల్లలు, రెండో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ షోలో హైలెట్ ఏమిటంటే... రేణు కుమారుడు అకీరా తన తల్లి గురించి సందేశం పంపడం.

    ఈ షోలో మరో సర్‌ప్రైజ్ ... త్వరలో రేణు దేశాయ్ పూణెకు చెందిన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంటున్న నేపథ్యంలో అతడు రేణు గురించి ఓ స్వీట్ వాయిస్ మెసేజ్ పంపగా దాన్ని అలీ షోలో ప్లే చేశారు. రేణు గురించి అతడు వర్ణించి తీరు అద్భుతంగా ఉంది.

    అకీరా సందేశం

    అకీరా సందేశం

    ‘అమ్మ.. నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, స్ట్రాంగెస్ట్ ఉమెన్. మాకు జన్మనిచ్చింది, ప్రేమను పంచింది. నువ్వు నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేశావ్. నన్ను కన్నావు, నా ప్రేమ, నీపై నాకు ఉన్న గౌరవం గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. ఐలవ్ యూ అమ్మా.. నేను ఎప్పుడూ నీ పక్షమే.' అని అకీరా చెప్పుకొచ్చారు.

    ఎమోషనల్ అయిన రేణు దేశాయ్

    ఎమోషనల్ అయిన రేణు దేశాయ్

    అకీరా సందేశం వినగానే రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. ‘ఎక్కడి నుంచి వస్తాయి ఈ పదాలు, నేను అకీరా వాయిస్‌కు పెద్ద అభిమానిని, ఆద్యా, అకీరా ఇద్దరూ లేకుండా నేను నా జీవితాన్ని ఊహించలేను' అని చెప్పుకొచ్చారు.

    త్వరలో రెండోపెళ్లి చేసుకుంటున్నాను, దొంగపని కాదు

    త్వరలో రెండోపెళ్లి చేసుకుంటున్నాను, దొంగపని కాదు

    ‘‘త్వరలో నేను ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ విషయం నేను ఇన్ స్టాగ్రామ్‌లో కూడా పెట్టాను. ఆయన గురించి వివరాలు, ఫోటోలు బయటపెట్టలేదు కానీ.. మరో పెళ్లి చేసుకోబోతున్న విషయం అనౌన్స్ చేశాను. ఇది సీక్రెట్‌గా చేయడానికి దొంగపని కాదు.'' అని రేణు దేశాయ్ అన్నారు.

    మా ఇద్దరికీ పిల్లలు ఉన్నారు, అందుకే సమయం పడుతుంది

    మా ఇద్దరికీ పిల్లలు ఉన్నారు, అందుకే సమయం పడుతుంది

    ఇటీవల మా ఎంగేజ్మెంట్ జరిగితే హ్యాండ్ ఫోటో పెడితే అందరూ ఆ విషయంలో సర్కర్ చేశారు. తర్వాత పెళ్లి ఇంకా జరుగడం లేదంటూ పెద్ద చర్చ... నా పెళ్లి గురించి నేను, నా పిల్లలు, ఫ్రెండ్స్‌కు తప్ప అందరికీ హడావుడి ఎక్కువైంది. పెళ్లంటే జోక్ కాదు. దానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది. నాకు, నా ఫియాన్సీకి పిల్లులు ఉన్నారు. ప్రతి విషయంలోనూ ఆలోచించుకుంటూ ముందుకు వెళ్లాలి అని రేణు దేశాయ్ అన్నారు.

    ఆయన పేరు చెప్పలేను

    ఆయన పేరు చెప్పలేను

    ‘‘నన్ను పెళ్లాడబోయే వ్యక్తి పేరు చెప్పలేను. అలా చేస్తే ఆయన అనవసర ఇబ్బందులు ఎదురవుతాయి . యూఎస్ రిటర్న్, పూణెలో ఉంటారు. ఐటీ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు.'' అని తనకు రాబోయే భర్త గురంచి రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు.

    రేణు దేశాయ్ గురించి వాయిస్ మెసేజ్ పంపిన ఫియాన్సీ

    రేణు దేశాయ్ గురించి వాయిస్ మెసేజ్ పంపిన ఫియాన్సీ

    ‘‘రేణు..నాకు తెలిసిన అద్భుతమైన వ్యక్తివి నువ్వు. నీతో జీవనం, నువ్వు చేస్తున్న ఎన్నో పనులు నేను గర్వపడేలా చేస్తున్నాయి. నువ్వు పని, ఇంటి బాధ్యతలు హ్యాండిల్ చేసే విధానం చూసిన తర్వాత నీపై గౌరవం మరింత పెరిగింది. సింగిల్ మదర్‌గా ఆద్య, అకీరాను అద్భుతంగా పెంచావు. ఇద్దరు పిల్లలు చాలా హంబుల్, కైండ్, వెల్ మ్యానర్డ్.. ఈ క్రిడెట్ అంతా సూపర్ మామ్‌గా నీకే దక్కుతుంది. నువ్వు కేరింగ్, కైండ్, లవింగ్ పర్సన్.. నువ్వు సంతోషంగా ఉంటావు. కష్టసమయంలో కూడా నీకు నువ్వుగా బౌన్స్ బ్యాక్ అయ్యే విధానం గొప్పగా ఉంటుంది. నువ్వు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ మాత్రమే కాదు డికేడ్, సెంచరీ.'' అంటూ రేణు దేశాయ్‌ని త్వరలో పెళ్లాడబోయే వ్యక్తి పొగడ్తల వర్షం కురిపించారు.

    English summary
    Akira voice sent message to Ali tho saradaga show about his mother Renu Desai. Renu Desai is a former actress and director, produicer. She has a son, born in 2004 with Tollywood actor Pawan Kalyan, whom she married in 28 January 2009. The couple also has a daughter born in 2010. They have reportedly filed for divorce as of 2011.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X