రాజమౌళి సినిమాని బూతు సినిమా అని ప్రచారం చేస్తున్నారు
నార్త్ మీడియాకు మొదటి నుంచీ సౌత్ సినిమా అంటే చిన్నచూపు ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగులో సూపర్ హిట్టయిన విక్రమార్కుడు చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ తో రౌడీ రాధోడ్ అనే టైటిల్ తో తెరకెక్కుస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడ మిడ్ డే వంటి ముంబై బేసెడ్ టాప్ పత్రికలు అక్షయ్ కుమార్ ఓ బూతు సినిమా రీమేక్ లో చేస్తున్నాడు అంటూ విమర్సిస్తూ రాసుకొచ్చాయి. నిజానికి విక్రమార్కుడులో కొంత వల్గారిటీ ఉన్నా హిందీలో రెగ్యులర్ గా తీసే సినిమాలతో పోలిస్తే చాలా తక్కువనేది అందరికీ తెలిసిన విషయం. దానితో కావాలనే అక్కడ మీడియా ఇక్కడ సినిమాలును అవహేళన చేస్తోందంటున్నారు. మరో ప్రక్క సల్మాన్ ఖాన్ వరసగా సౌత్ సినిమాలను రీమేక్ చేయాలనుకోవటం, మిగతా హీరోలు కూడా సౌత్ దర్శకులు అంటే ఆసక్తి చూపటం వారికి మంటపుట్టిస్తోంది. ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పోకిరీని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేయనుంది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా గత కొద్ది రోజులుగా స్క్రిప్టు పై కసరత్తులు చేస్తున్నారు. ఇక విక్రమార్కుడు ఈ చిత్రం మొన్నీ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











