AGENT beast mode: అఖిల్‌ను నెవర్ బిఫోర్ అనేలా చూపిస్తా.. ఇలా మారడానికి 7నెలలు పట్టింది

అక్కినేని యువ హీరో అఖిల్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బ కొడుతున్నాయి. అయితే ఈ సారి అతని లుక్కు చూస్తుంటే బాక్సాఫీస్ ను రికార్డులతో రివర్స్ దెబ్బ కొట్టేలా ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి మూడు సినిమాలతో అతని కెరీర్ కు గట్టి దెబ్బ పడింది. ఇక ఇప్పుడు సురేంధర్ రెడ్డితో కలిసి ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో పవర్ఫుల్ బాక్సాఫీస్ హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఏజెంట్ కు సంబంధించిన మరొక స్టైలిష్ లుక్ ను రిలీజ్ చేశారు.

సరికొత్తగా మార్చేశాడు

సరికొత్తగా మార్చేశాడు

అఖిల్ అన్నయ్య స్టైల్ లోనే కొన్ని ప్రేమకథలతో విజయాలను అందుకోవాలని అనుకున్నాడు గాని పెద్దగా వర్కౌట్ కాలేదు.అయితే సురేందర్ రెడ్డి లాంటి మాస్ దర్శకుడు అతన్ని సరికొత్తగా మార్చేశాడు. ఈ దర్శకుడు హీరోలను ఏ స్థాయిలో ప్రజెంట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అఖిల్ ఏజెంట్ హడావుడి చూస్తుంటే అంతకుమించి అనేలా ఉంది.

హిట్ కొట్టడానికి సిద్ధమయ్యాడు

హిట్ కొట్టడానికి సిద్ధమయ్యాడు

కిక్, రేసుగుర్రం, ధృవ వంటి సినిమాలతో బాక్సాఫీస్ దర్శకుడిగా క్రేజ్ అందుకున్న సురేందర్ రెడ్డి సైరా సినిమాతో కొంత పరవలేదనిపించాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ తో మరో హిట్ కొట్టడానికి సిద్ధమయ్యాడు.

7నెలలు కష్టపడాల్సి వచ్చింది

7నెలలు కష్టపడాల్సి వచ్చింది

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం సురేంధర్ రెడ్డి చాలా సమయాన్ని తీసుకున్నాడు. ఇక అఖిల్ న్యూ లుక్ కోసం దాదాపు 7నెలలు కష్టపడాల్సి వచ్చిందట. సోషల్ మీడియాలో ఒక ఫొటో పోస్ట్ చేసిన సురేంధర్ రెడ్డి బీస్ట్ లుక్ అంటూ కామెంట్ చేశాడు. అఖిల్ ను తప్పకుండా నెవర్ బిఫోర్ అనేలా చూపిస్తానని ట్విట్టర్ ద్వారా అభిమానులకు మాట ఇచ్చాడు.

Recommended Video

Karthi emotional words On Akkineni Nagarjuna | Sulthan Movie
ఏజెంట్ కోసం గుర్రపు స్వారీ

ఏజెంట్ కోసం గుర్రపు స్వారీ

అఖిల్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఏజెంట్ సినిమా కోసం అఖిల్ గుర్రపు స్వారీ శిక్షణ కూడా తీసుకున్నాడు. పర్సనల్ గా గిజెల్లే పెంపుడు గుర్రంతోనే శిక్షణ తీసుకున్న అఖిల్ అందుకు సంబంధించిన ఫొటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. చూస్తుంటే ఈ దర్శకుడి రేసుగుర్రం ఫార్ములా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X