హీరోగా 'అక్కినేని అఖిల్’
అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య హీరోగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కినేని అభిమానుల్ని అలరించేందుకు 'జోష్" ఆడియో విడుదల వేడుకలో నాగచైతన్య చాలా కాన్ఫిడెంట్ గా కన్పించాడు. డైరెక్టర్ వాసువర్మ నాగచైతన్య టాలెంట్ గురించి పొగిడేయడం, 'దిల్" రాజు పొగడ్తలు కూడా నాగచైతన్య దక్కించుకోవడం అక్కినేని అభిమానుల్ని ఈ ఆడియో విడుదల వేడుకలో ఊర్రూతలూగించింది. పుత్రోత్సాహంతో నాగార్జున ఉప్పొంగి పోయాడు 'జోష్" ఆడియో విడుదల వేడుకలో ఇదిలా ఉంటే, నాగచైతన్యతోపాటు, అందరి దృష్టినీ ఈ వేడుకలో ఆకర్షించింది అక్కినేని అఖిల్. బాల నటుడిగా 'సిసింద్రి" చిత్రంలో కన్పించిన అఖిల్, 'లైన్ లో నెక్ట్స్ నేనే..." అంటున్న ఈ కార్యక్రమంలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఇతనితో జట్టు కట్టడానికి ప్రముఖ హీరోయిన్ (జగదేకవీరుడు అతిలోక సుందరి) శ్రీదేవి కూతురు 'జాహ్నవీ" రెడీ అవుతోందని సినీ వర్గాలు తెలిపాయి. సోదరుడి తెరంగేట్రాన్ని మాగ్జిమామ్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కన్పించిన అఖిల్ ని త్వరలో హీరోని చేసేందుకు నాగ్ ఇప్పటినుంచే సన్నాహాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టెన్త్ క్లాస్ లవ్ స్టోరీల్ని సైతం జనం 'ఓకే" చేసేస్తుండడంతో త్వరలోనే అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ హీరోగా వెండితెరపై కన్పిస్తాడేమో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











