అంధుల పాఠశాలలో అఖిల్ దుస్తుల పంపిణీ (ఫోటోస్)
హైదరాబాద్: నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని సినిమాల్లోకి రాముందు నుండే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ‘మనం' చిత్రంలో గెస్ట్ రోల్ చేయడంతో పాటు, యాడ్ ఫిల్మ్స్ లో నటించాడు. సినీతారల క్రికెట్లో పరుగుల వరద పారించి అందరి మనసు దోచుకున్నాడు.
ఇపుడు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నాడు. ఆ మధ్య తల్లి అమల నడిపిస్తున్న బ్లూక్రాస్ సంస్థ తరుపున కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తాజాగా అంధుల పాఠశాలలో దుస్తుల పంపిణీ చేసి తన సేవాగుణం చాటుకున్నాడు. ఇతర సెలబ్రిటీల మాదిరిగానే తనకు చేతనైన సహాయం చేస్తున్నాడు.
స్లైడ్ షోలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, అఖిల్ సినిమాలకు సంబందించిన...

అంధపాఠశాలలో
అంధ పాఠశాలను సందర్శించిన అఖిల్ అక్కడి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసారు.

అఖిల్ అక్కినేని
అఖిల్ సినిమాల విషయానికొస్తే...అఖిల్ హీరోగా చేయబోతున్న తొలి సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈచిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఆల్ ది బెస్ట్
త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న అఖిల్‌కు పలువురు విద్యార్థులు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

సాదా సీదాగా కాదు...
అఖిల్ అక్కినేని తన తొలి సినిమా సాదా సీదాగా ఉండాలని భావించడం లేదు. భారీ హిట్టు కొట్టాలనే తపనతో ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











