సోల్ మేట్‌ని అన్వేషిస్తూ సాగిన హీరో: అఖిల్ "హలో" టీజర్
యాక్షన్ ప్రాధానంగా మూవీ కొనసాగినట్లు టీజర్ ద్వారా తెలుస్తుంది. మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. చిన్నతనంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు.
Recommended Video

అక్కినేని యంగ్ హీరో అఖిల్ కొత్త సినిమా హలో టీజర్ నిన్ననే విడుదలైంది. మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ తో 'ద లక్కీయెస్ట్ పీపుల్ బోర్న్ ఆన్ ఇన్ దిస్ ఎర్త్. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా, ఏం అడ్డు వచ్చినా, తన సోల్ మేట్‌ని కలుస్తారు. లైఫ్‌ని షేర్ చేసుకుంటారు.' అంటూ టీజర్ ప్రారంభమైంది.

యాక్షన్ ప్రాధానంగా
యాక్షన్ ప్రాధానంగా మూవీ కొనసాగినట్లు టీజర్ ద్వారా తెలుస్తుంది. మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. చిన్నతనంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు.. పెద్దయ్యాక ఆ అమ్మాయిని వెత్కుకుంటూ అన్వేషణ కొనసాగించే యువకుడి పాత్రలో అఖిల్ కనిపించబోతున్నాడని హింట్ ఇచ్చేశారు.

అఖిల్ చెప్పే సింగిల్ డైలాగ్
టీజర్‌కు తగ్గట్లు అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.ఇక చివర్లో అఖిల్ హల్లో అని చెప్పే సింగిల్ డైలాగ్ మాత్రమే ఉంది. జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 22న హలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

యాక్షన్ కంటెంట్
అఖిల్ అండ్ కొత్తపిల్ల కళ్యాణి సినిమాలో కొత్తగానే ఉన్నారు. అయితే ఇక్కడ అన్నింటికంటే కొత్తగా ఉంది మాత్రం..యాక్షన్ కంటెంట్. బిల్డింగ్స్ మీద నుండి దూకడం.. బైక్ చేజులూ.. జంపులూ.. ఇవన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ రోడ్లపై ఆ ఛేజులన్నీ అసలు మనం చూస్తోంది హైదరాబాద్ నేనా అనే తరహాలో ఉన్నాయి. బహుశా హాలీవుడ్ యాక్షన్ కొరియాగ్రాఫర్ ఉంటే దాని స్టయిల్ ఇలాగే ఉంటుంది కాబోలు.
కళ్యాణి ప్రియదర్శన్
మూవీ డిసెంబర్ 22న హలో అంటూ మనల్ని పలకరించనుంది. ఈ చిత్రంలో కథానాయికగా సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. విక్రమ్- వినోద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఇలాంటి సింపుల్ స్టోరీని ఖచ్చితంగా సింపుల్ గా మాత్రం నెరేట్ చేయడు మన విక్రమ్ కుమార్ అంటున్నారు సినిమా లవ్వ్రర్స్. నాగార్జున్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు పిఎస్ వినోద్ అందించిన విజువల్స్ అద్భుతం అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











