»   » ఆటో నడిపి చిన్నారికి సాయం చేసిన అఖిల్ (ఫోటో)

ఆటో నడిపి చిన్నారికి సాయం చేసిన అఖిల్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖమ్మం: టాలీవుడ్ స్టార్ అఖిల్ అక్కినేని మంగళవారం ఖమ్మంలో సందడి చేసారు. ఖమ్మం నరసింహస్వామి దేవాలయ సమీపంలో చెందిన చిన్నారి అశ్విత్ రెడ్డి కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నారు. ఆ చిన్నారి అఖిల్ కు అభిమాని కావడంత, అఖిల్ ను కలవాలని కోరుకోవడంతో అతని కోరిక మేరకు ఇక్కడికి వచ్చి పరామర్శించాడు.

ఈ సందర్బంగా ఖమ్మం నగరంలో ఆటో నడిపి సందడి చేశాడు అఖిల్. ఆటో నడిపి ప్రయాణికులు ఇచ్చిన రూ.3వేలను చిన్నారి కుటుంబానికి అందజేశాడు. దీంతో పాటు మంచు లక్ష్మి నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా బాలుడికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి వంశీ తెలిపారు.

Akhil Akkineni Auto driving

మంచు లక్ష్మి ‘మేముసైతం' పేరుతో విభిన్నమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతర స్టార్లతో భాగస్వామ్యం అయి ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల కూకట్ పల్లిలోని మంజీరా మాల్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కూరగాయలు అమ్మించి నిధులు సేకరించింది మంచు లక్ష్మి.

ఒక మంచి పని కోసం చేస్తున్న కార్యక్రమం కావడంతో మంచు లక్ష్మికి ఇతర టాలీవుడ్ స్టార్ నుండి సహాయం అందుతోంది. మంచు లక్ష్మి తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల్లో వారూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. టాలీవుడ్ స్టార్లంతా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుందాం.

English summary
Tollywood star Akkineni Akhil today meets critically ill fan-in khammam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu