twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినాయిక్, అఖిల్ చిత్రం ప్రారంభం(ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : వివి వినాయిక్ దర్శకత్వంలో అఖిల్‌ అక్కినేని హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. సాయేషా సైగల్‌ హీరోయిన్. సుధాకర్‌రెడ్డి, నితిన్‌ నిర్మాతలు. శనివారం రాత్రి అభిమానుల సమక్షంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మనం సినిమాతో అఖిల్‌ను పరిచయం చేయాలనే ఆలోచన నాన్నగారిదే. తను ఎక్కువ రోజులు బతకననే నాన్న ఉద్ధేశ్యంతోనే అఖిల్ అరంగేట్రం ఆలోచన పుట్టింది.ఇలాంటి శుభతరుణంలో ఆయన మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం అని అన్నారు నాగార్జున.

    దర్శకుడు కె.రాఘవేంద్రరావు, హీరో వెంకటేష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగా పరిచయం అవుతున్న హీరో అఖిల్ ని మంచి విజయం సాధించాలని ఆశ్వీరదించారు.

    స్లైడ్ షోలో...ప్రారంభ ఫొటోలు

    నితిన్ నిర్మాతగా..

    నితిన్ నిర్మాతగా..

    శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    పరిచయ వేదిక

    పరిచయ వేదిక

    అఖిల్ పరిచయ వేదిక కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.

    వివి వినాయిక్ మాట్లాడుతూ...

    వివి వినాయిక్ మాట్లాడుతూ...

    ''నాగార్జునగారు నాపై పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా. 'మనం'లో అఖిల్‌ను చూడగానే అందరిలా నేనూ షాక్‌కు గురయ్యా. అంత బాగా నచ్చేశాడు. ఎంత నచ్చాడో ఈ చిత్రంలో చూపిస్తాను''అన్నారు వి.వి.వినాయక్‌.

    వినాయక్‌ కంటిన్యూ చేస్తూ...

    వినాయక్‌ కంటిన్యూ చేస్తూ...

    ''వంద శాతం కష్టపడే సాంకేతిక బృందం కుదిరింది. ప్రతి ప్రేక్షకుడికీ నచ్చేలా అఖిల్‌ను తెరపై చూపిస్తానని మాటిస్తున్నాను''అన్నారు.

    వెంకటేష్‌ మాట్లాడుతూ...

    వెంకటేష్‌ మాట్లాడుతూ...

    ''అఖిల్‌ రూపంలో ఒక కొత్త స్టార్‌ రాబోతున్నాడు. ఇక అక్కినేని అభిమానులకు పండగే. అఖిల్‌ ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాడు. వినాయక్‌ దర్శకత్వంలో తెరంగేట్రం అవ్వడం ఆనందంగా ఉంది''అన్నారు.

    కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ...

    కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ...

    ''విక్టరీ మధుసూదనరావుగారి చేతుల మీదుగా తెరకు పరిచయమయ్యారు నాగార్జున. ఒక 'వి' ఉన్న దర్శకుడి చేతులమీదుగా పరిచయమైన నాగార్జున మంచి పేరు తెచ్చుకొన్నాడు. మూడు 'వి'లు ఉన్న వినాయక్‌ చేతులమీదుగా పరిచయమవుతున్న అఖిల్‌ మరింత పేరు తెచ్చుకొంటాడు''అన్నారు.

    నాగచైతన్య మాట్లాడుతూ...

    నాగచైతన్య మాట్లాడుతూ...

    ''ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా. సినిమా అంటే అఖిల్‌కు ప్రాణం. తాను చేసే ప్రతి సినిమా ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందన్న నమ్మకముంది. దేశంలోని సినిమా అభిమానులందరినీ ఆకట్టుకొంటాడన్న నమ్మకముంది''అన్నారు.

    నితిన్‌ మాట్లాడుతూ...

    నితిన్‌ మాట్లాడుతూ...

    ''ప్రతిష్ఠాత్మకమైన ఈ సినిమాకు నేను నిర్మాత కావడం ఆనందంగా ఉంది. నాగార్జునగారు మాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నెరవేర్చుతాం. ఆయన చేసిన ప్రేమకథా చిత్రాలు 'గీతాంజలి', 'నిన్నే పెళ్లాడతా'.. మాస్‌ సినిమాలు 'శివ', 'మాస్‌' కలిపితే ఎలా ఉంటుందో అఖిల్‌ చేసే ఈ సినిమా అలా ఉంటుంది''అన్నారు.

    నాగార్జున మాట్లాడుతూ...

    నాగార్జున మాట్లాడుతూ...

    ''అఖిల్‌ను 'మనం' రూపంలో నాన్న ఆశీర్వదించారు. అఖిల్‌కు సూపర్‌ హిట్‌ సినిమా ఇస్తామని వినాయక్‌, నితిన్‌ మాటిచ్చారు. ఈ కథ నేనూ విన్నాను. చాలామంది ఇదొక ప్రేమకథ అనుకొంటున్నారు. అది నిజం కాదు. సినిమా నిండా మాస్‌ అంశాలు ఉన్నాయి''అన్నారు నాగార్జున.

    అమల మాట్లాడుతూ....

    అమల మాట్లాడుతూ....

    ''అందరిలాగే అఖిల్‌ సినిమా గురించి నేనూ ఎదురు చూస్తున్నా. మా అబ్బాయిని అభిమానుల చేతుల్లో పెడుతున్నాను''అన్నారు.

    అఖిల్‌ మాట్లాడుతూ....

    అఖిల్‌ మాట్లాడుతూ....

    ''ఈ సమయంలో తాతగారు ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఆయన అభిమానుల్లోనే దేవుడిని చూసుకొనేవారు. అభిమానులు ఎంతో ఇస్తారు. మేం తిరిగి వాళ్లకు హిట్‌ సినిమా తప్ప ఏం ఇవ్వగలం. ఎలాగైనా హిట్‌ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకొన్నా. దాని గురించే ఆలోచిస్తూ నాన్నను అడిగేవాణ్ని. అప్పుడు చీకట్లో ఉన్న నాకు ఒక సెర్చ్‌లైట్‌లా కనిపించారు వి.వి.వినాయక్‌గారు. ఇలాంటి సినిమాకు వినాయక్‌గారే దర్శకత్వం వహించాలని నాకనిపించింది.

    అఖిల్ కంటిన్యూ చేస్తూ...

    అఖిల్ కంటిన్యూ చేస్తూ...

    కేవలం అభిమానుల కోసమే తొలి సినిమా చేయాలని నితిన్‌ చెబుతూ ఉండేవాడు. ఆయన నా సినిమాకు నిర్మాత కావడం ఆనందాన్నిచ్చింది. ఇందులో యాక్షన్‌, డ్యాన్స్‌ అన్నీ కొత్తగా ఉంటాయి. మూడు నాలుగేళ్లుగా డ్యాన్స్‌ నేర్చుకుంటున్నా. అందరికీ నచ్చేలా తెరపై కనిపిస్తా. ఈ సినిమాకు తమన్‌, అనూప్‌ రూబెన్స్‌ కలసి సంగీతం అందిస్తారు''అన్నారు.

    మల్టి స్టారర్ చేస్తాం..

    మల్టి స్టారర్ చేస్తాం..

    నేను ఈ స్థాయికి చేరుకోవటానికి అమ్మనాన్నలే ముఖ్య కారణం. అన్నయ్య నాగచైతన్య ఇంత ఎమోషనల్ మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి ఓ పెద్ద మల్టీస్టారర్ సినిమా చేస్తాం అన్నారు అఖిల్.

    ఎవరెవరు..

    ఎవరెవరు..

    ఈ కార్యక్రమంలో వినాయక్, రాఘవేంద్రరావు, వెంకటేష్, నాగచైతన్య, నాగసుశీల, అమల, సుశాంత్, అనూప్‌రూబెన్స్, సయేషా తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Akkineni Akhil's First Film Launched last night at Hyderabad directed by VV Vinayak.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X