అఖిల్ హీరోయిన్ ఖరారు...ఈమే (ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ హీరోగా ఓ చిత్రం మొన్నీ మద్యనే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ సెట్ కాలేదని చెప్పారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అమీర దస్తూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

https://www.facebook.com/TeluguFilmibeat

అమీర దస్తూర్ గతంలో హిందీ చిత్రంలో లో ప్రతీక్ బబ్బర్ సరసన చేసింది. అలాగే ప్రస్తుతం ధనుష్ సరసన కె.వి ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతు్నన చిత్రం చేస్తోంది. మొదట్లో అలియా భట్ ని అనుకున్నా..ఆమె డేట్స్ దొరకకపోవటంతో ఈ హీరోయిన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెతో ఇప్పటికే మాట్లాడినట్లు చెప్తున్నారు.

అక్కినేని అఖిల్‌ నటించబోయే తొలి సినిమాకి హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది ఆసక్తిగా మారింది. శ్రీదేవి కూతురు జాహ్నవి దగ్గర నుంచి ఆలియాభట్‌, రాశిఖన్నా, అవికాగోర్‌ లాంటి ఎంతోమంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే అఖిల్‌ సరసన కొత్త హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఖిలే స్వయంగా తెలిపాడు.

‘‘ నేనూ కొత్తవాడ్నే కదా...హీరోయిన్‌ కూడా న్యూఫేస్‌ అయితే బాగుటుందని..అందుకే స్ర్కీన్‌ టెస్ట్‌లు చేస్తున్నాం, వి.వి.వినాయక్‌ తెరకెక్కించనున్న నా తొలి చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది.'' అని అఖిల్‌ తెలిపాడు. ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమాలు ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అఖిల్‌ స్నేహితుడు నితిన్‌ నిర్మిస్తుండడం విశేషం. వచ్చే జనవరి నుంచి ఈ చిత్ర రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలవుతుంది.

ఇక మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ అఖిల్ తొలి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువ హీరో నితిన్ నిర్మిస్తున్నారు.ఈ వార్తను అఖిల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

Akkineni Akhil's heroine confirmed

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ... ‘గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నేను హీరోగా పరిచయమవుతున్న సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. నా డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ & సుధాకర్ రెడ్డిలకు అల్ ది బెస్ట్. వీరితో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం అయినందుకు క్షమించండి.' అని అన్నారు.

నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించే అవకాశాన్ని మా చేతుల్లో పెట్టినందుకు నాగార్జున గారికి మరియు నా సోదరుడు అఖిల్ కు థాంక్స్. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. భారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి. అని అన్నారు.

ఇక అక్కినేని అఖిల్ ను హీరోగా పరిచయం చేసే భాధ్యతను తనపై ఉంచిన నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని దర్శకుడు వివి వినాయిక్ తెలిపారు. శ్రీ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. నిన్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఈ స్క్రిప్టుని పూజలో ఉంచారు.

వినాయిక్ మాట్లాడుతూ... ఫ్యాంటసీ నేపధ్యంలో సాగే ప్రేమ కథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్బుతమైన స్క్రిప్టు ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాధోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలెడతాం. అభిమానులు కోరుకునే మాస్,మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి అన్నారు.

అఖిల్ మాట్లాడుతూ... ‘గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నేను హీరోగా పరిచయమవుతున్న సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. నా డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ & సుధాకర్ రెడ్డిలకు అల్ ది బెస్ట్. వీరితో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం అయినందుకు క్షమించండి.' అని అన్నారు.

నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించే అవకాశాన్ని మా చేతుల్లో పెట్టినందుకు నాగార్జున గారికి మరియు నా సోదరుడు అఖిల్ కు థాంక్స్. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. భారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి. అని అన్నారు.

మరో ప్రక్కన ఇంకా హీరోగా అరంగేట్రం చేయకుండానే అక్కినేని అఖిల్‌కు ఫాలోయింగ్‌ ఎక్కువైంది. ప్రముఖ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు. మెహిదీపట్నంలో సెయింట్‌ ఆన్స్‌ ఉమెన్స్‌ కాలేజీ నిర్వహించిన ‘ మేకింగ్‌ ఏ డిఫరెన్స్‌ ' అనే పరిశుభ్రత కార్యక్రమానికి అతిధిగా అఖిల్‌ వెళ్లాడు. అసలే అఖిల్‌కు లేడీ ఫాలోయింగ్‌తో పాటు లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువ..అందులోనూ లేడీస్‌ కాలేజీకి గెస్ట్‌గా వెళ్లిన అఖిల్‌ చుట్టూ... బెల్లం మీద ఈగలు వాలినట్టు.. అమ్మాయిలు అఖిల్‌ చుట్టూ వాలిపోయారు.

కొందరు షేక్‌హ్యాండ్స్‌, సెల్ఫీ ఫోటోల కోసం ఎగబడితే.. మరికొందరు అఖిల్‌ మోహం, మీసాలు, గడ్డం, వీపు తడిమి భయపెట్టారట. దీంతో కంగారుపడ్డ అఖిల్‌ ఏదోవిధంగా ఆ కాలేజీ నిర్వహించిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బయటపడ్డాడని టాక్‌. అఖిల్‌కు అంత క్రేజ్‌ ఉంది కాబట్టే టైటాన్‌ వాచ్‌ కంపెనీ, మౌంటెన్‌ డ్యూ సాఫ్ట్‌ డ్రింక్‌ కంపెనీలు అఖిల్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X