మౌంటేన్ డ్యూ: అక్కినేని అఖిల్ సాహసం?
హైదరాబాద్: పెప్సికో కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైన సాఫ్ట్ డ్రింక్ ‘మౌంటేన్ డ్యూ' యాడ్స్ గతంలో మీరు చూసే ఉంటారు. ఈ మౌంటేన్ డ్యూ యాడ్స్ అడ్వంచరస్ స్పోర్ట్స్‌తో కూడి సాహసోపేతంగా ఉంటాయి. గతంలో ఈ బ్రాండ్‌కు ప్రచారం చేసిన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ పలు యాడ్స్‌లో సాహస కృత్యాలు చేస్తూ నటించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...తాజాగా ఈ బాండ్ అంబాసిడర్‌గా అక్కినేని నాగార్జున తనయుడు, అప్ కమింగ్ హీరో అఖిల్ ఎంపికయ్యాడు. త్వరలో అఖిల్‌పై యాడ్ చిత్రీకరణ జరుగనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ యాడ్లో అఖిల్ గాల్లో ఎగురుతూ సాహసం చేస్తాడని వినికిడి. ఈ యాడ్ ఎప్పుడొస్తుందా అని అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టనప్పటికీ....అక్కినేని ఫ్యామిలీ వారసత్వం ఉండటం కావడం, నాగార్జున కూడా అఖిల్‌ను హీరోగా ప్రమోట్ చేయడంలో భాగంగా ఇలాంటి అవకాశాలు వచ్చేలా చేస్తున్నాడట. ఇటీవల టైటట్ టైమ్ లెస్ యాడ్లో కల్కి కోచ్లిన్‌తో కలిసి అఖిల్ నటించిన సంగతి తెలిసిందే.
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ తెరంగ్రేటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్లో సినిమాను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తారట. అఖిల్ తొలి సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. 2015 మే 1 నాటికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.


Click it and Unblock the Notifications











